టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ విషయంపై పార్లమెంట్‌లో చర్చించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.
సాధారణంగా జట్టు విజయాలు సాధిస్తున్నప్పుడు ఆ టీమ్‌లో కొన్ని లోపాలు ఉన్నా వాటి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అవన్నీ విజయలో కొట్టుకోపోతాయి. కానీ కేఎల్ రాహుల్ విషయంలో మాత్రం ఈ ఫార్మాలా పూర్తి భిన్నంగా ఉంది. ఇండియా గెలిచినా, ఓడినా రాహుల్ ఆడకపోతే మాత్రం మేం అతనిని వదలం అనేట్టుగా ఉన్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో రాహుల్ ఫామ్‌పై చాలా రోజులుగా ఎవరో ఒకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ రాహుల్ ఫామ్‌పై స్పందించారు. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ అయిన శేఖర్ గుప్తా ఏకంగా సెలక్షన్ కమిటీనే తప్పుబట్టారు.
తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం రాహుల్ ఫామ్ గురించి ఒక ట్వీట్ చేశారు. దీంతో రాహుల్ ఫామ్ విషయం ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది. శేఖర్ గుప్తా వ్యాఖ్యలను సమర్ధిస్తూ సెలక్షన్ కమిటీపై శశిథరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనితో రాహుల్ ఫామ్ గురించి, బీసీసీఐలో జరుగుతున్న రాజకీయాల గురించి పార్లమెంట్‌లో చర్చ జరపాలని కొంతమంది క్రికెట్ అభిమానులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా మాట్లాడుతూ.. “జట్టు ఎంపికలో పక్షపాతం లేనంతవరకు భారత జట్టు మంచి పటిష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు అలా కనిపించట్లేదు. 2017 నుంచి కేవలం 25 సగటుతో టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఓ ప్లేయర్‌కు ఇంకా అవకాశాలు ఇస్తున్నారు. అది కూడా గిల్ లాంటి ప్లేయర్ అద్భుత ఫామ్‌లో ఉండంగా”అంటూ పరోక్షంగా రాహుల్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించాడు.
శేఖర్ గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ .. “సంజు శాంసన్‌ను ప్రస్తావించారు. వన్డేల్లో దాదాపు 76 సగటు కలిగిన సంజును ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేయలేదు. పేలవ ప్రదర్శన చేసే వారికీ అవకాశాలు ఇవ్వడం గురించి పక్కన పెడితే, మంచి ఫామ్‌లో ఉన్న వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు ?” అని ప్రశ్నించారు. దీనితో నెటిజన్లు కొంతమంది టాలెంటెడ్ క్రికెటర్లకు అన్యాయం జరుగుతోందని, ఈ విషయంపై పార్లమెంట్ లో చర్చించ్చాలంటూ కోరుతున్నారు. అయితే.. ఒక ఆటగాడు ఫామ్‌లో కోల్పోవడం, మళ్లీ పుంజుకోవడం సాధారణ విషయమని, లాంగ్ కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉంటాయని, దానికే పార్లమెంట్‌లో చర్చ జరపాలా? ఇదేం డిమాండ్ రా బాబూ అంటూ మరికొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
And what about @IamSanjuSamson ? Averaging 76 in ODIs and yet again omitted from the ODI squad against Australia. It’s all very well to give non-performers a long rope but surely not at the expense of talented performers? https://t.co/tg56JJMTue
— Shashi Tharoor (@ShashiTharoor) February 21, 2023