త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఇటివల బీసీసీఐ సెలెక్టర్లు టీమిండియాను ప్రకటించారు. ఈ టీమ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న జడేజా వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. కానీ.. జడేజా లేని లోటును తాను భర్తీ చేస్తానంటూ టీమిండియా యువ క్రికెటర్ చేతన్ సకారియా ముందుకొచ్చాడు. జడేజా బ్యాటింగ్ చేస్తూ.. హాఫ్ సెంచరీ చేసినా.. సెంచరీ చేసినా.. తన బ్యాట్‌ను ఖడ్గంలా తిప్పుతూ రాజసంగా సంబురాలు చేసుకుంటాడు. అతను చేసుకునే సెలబ్రేషన్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. జడేజా తన బ్యాట్‌ను ఖడ్గంలా తిప్పిన ప్రతిసారీ సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం మోకాలి సర్జరీతో టీ20 వరల్డ్ కప్ 2022కు జడేజా దూరమవ్వడంతో మైదానంలో అతని బ్యాటింగ్ విన్యాసాలతో పాటు బ్యాట్‌ను తిప్పే సీన్లు కూడా అభిమానులు చూడలేరు. ఆ లోటును తీర్చేందుకే చేతన్ సకారియా ఒక వీడియోను పోస్టు చేశాడు. ఆ వీడియోలో సేమ్ జడేజా తిప్పినట్టే సకారియా కూడా బ్యాట్‌ను ఖడ్గంలా తిప్పాడు. ప్రస్తుతం సకారియా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘జడ్డూ భాయ్‌ని ఎవరైన మిస్ అవుతుంటే.. ఇది చూడండి! ఆయన త్వరగా కోలుకోవాలి’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు సకారియా. దీనికి జడేజా కూడా రియాక్ట్ అయ్యాడు. వెల్డన్ సకారియా థ్యాంక్యూ అంటూ బదులిచ్చాడు. సకారియా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ఆడాడు.
చేతన్ సకారియాను 2021 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ 1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన సకారియా 14 వికెట్లు తీశాడు. అలాగే 2022లో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2022లో కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సకారియా 3 వికెట్లు పడగొట్టాడు. 2021లో శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లతో సకారియా జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. టీమిండియా తరఫున ఒక వన్డే ఆడి రెండు వికెట్లు, రెండు టీ20లు ఆడి ఒక వికెట్ పడగొట్టాడు. మరి జడేజాలా బ్యాట్‌ను అద్భుతంగా తిప్పిన సకారియా టీమిండియాలో కూడా జడేజాలా చక్రం తిప్పాలాని.. క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి సకారియా బ్యాట్ తిప్పిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాకు ఎంపికవ్వడంపై DK స్పెషల్ ట్వీట్!
In case you are missing jaddubhai 🤩😇🤺⚔️@imjadeja
Here’s wishing him a speedy recovery ❤️🩹💪 🦁 pic.twitter.com/HzBbSLk4uX
— Chetan Sakariya (@Sakariya55) September 14, 2022