స్వదేశంలో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 సాధించడమే లక్ష్యంగా బీసీసీఐ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్, మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో బీసీసీఐ ఆదివారం ముంబైలో సమావేశమైంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషాతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్న ఈ రివ్యూ మీటింగ్‌లో టీ20 వరల్డ్ కప్ వైఫల్యాలతో పాటు.. భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించి.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది బీసీసీఐ.
వాటిలో ముఖ్యంగా.. ఆటగాళ్లు తరచూ గాయాలపాలు కావడం, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌తో పాటు జాతీయ జట్టుకు ఎంపిక చేసే విధానాల్లో పలు మార్పులు చేసింది. గతంలో కొన్నేళ్ల పాటు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను నిర్దారించేందుకు నిర్వహించిన.. యో-యో టెస్ట్‌ను మళ్లీ ప్రవేశపెట్టారు. ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక అవ్వలంటే.. ఈ టెస్టును కచ్చితం పాసై తీరాలి. అలాగే యువ క్రికెటర్లు, ఎమర్జింగ్ క్రికెటర్లు కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌లో ఆడాలి. కనీసం కొన్ని సెషన్స్ అయినా ఆడితేనే.. జాతీయి జట్టుకు ఆడే అర్హతను సాధిస్తారు.
ఇక అన్నింటికంటే ముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే.. ఆటగాళ్ల గాయాలపై తీసుకుందని చెప్పవచ్చు. కొంతకాలంగా భారత కీలక ఆటగాళ్లు తరచు గాయపడుతూ జట్టుకు దూరం కావడం టీమిండియా విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ జడేజా గాయాలతో జట్టుకు దూరం కావడం వరల్డ్‌కప్‌లో జట్టుపై ఎలాంటి ప్రభావం చూపిందో చూశాం. అయితే ఇలాంటి పరిస్థితికి ఐపీఎల్ ప్రధాన కారణమంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐపీఎల్‌ను బ్యాన్ చేయాలనే డిమాండ్ కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అలాంటి పరిస్థితి తలెత్తకుండా.. ఐపీఎల్‌లోనూ భారత కీలక ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను బీసీసీఐ సెలెక‌్షన్ కమిటీ పర్యవేక్షించనుంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో మన దేశంలోనే జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 కోసం 20 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. ఈ 20 మందినే వరల్డ్ కప్‌కు ముందు జరిగే వన్డే సిరీస్‌లలో రోటేషన్ పద్ధతిలో ఆడిస్తారని తెలుస్తోంది. అలాగే ఈ 20 మందిని ఐపీఎల్ 2023లో వర్క్‌లోడ్‌పై బీసీసీఐ ఓ కన్నేసి ఉంచుతుంది. కీలక ఆటగాళ్లకు కచ్చితంగా రెస్ట్ లభించేలా.. సెలెక‌్షన్ కమిటీ ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లతో మాట్లాడుతూ.. వారికి కొన్ని మ్యాచ్‌ల్లో రెస్ట్ ఇచ్చేలా చూస్తుంది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, హార్ధిక్ పాండ్యాతో పాటు మరికొంత మంది కీలక ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్‌లో పూర్తి మ్యాచ్‌లు ఆడరు. కొన్ని మ్యాచ్‌ల్లో వారికి రెస్ట్ దొరకనుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 JUST IN: @BCCI on Sunday convened the review meeting of Team India (Senior Men) in Mumbai.
The meeting was attended by Roger Binny, Jay Shah, Rohit Sharma, Rahul Dravid, VVS Laxman & Chetan Sharma
– Player availability, workload management & fitness parameters were discussed pic.twitter.com/LZ24mb3SBF
— RevSportz (@RevSportz) January 1, 2023