ఆసియా కప్ 2022లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూసింది. గ్రూప్ స్టేజ్‌లో రెండు వరుస విజయాలతో జోరు చూపించిన భారత్.. సూపర్ ఫోర్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన టీమిండియా.. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడి ఆసియా కప్ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మహీష్ థీక్షణ షాకిచ్చాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్(6)ను ఇన్నింగ్స్ రెండో ఓవర్ చివరి బంతికి ఎల్బీ డబ్ల్యూగా అవుట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ దిల్షాన్ మధుశంకా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి ఓపెనర్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా ఆడారు.
ఈ క్రమంలో రోహిత్ శర్మ వేగంగా ఆడి లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 72 పరుగులు చేసిన రోహిత్‌ను కరుణరత్నే స్లోవర్ షార్ట్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. సూర్యకుమార్‌తో కలిసి 100పైగా పరుగుల భాగస్వామ్య నెలకొల్పి రోహిత్ కీలక సమయంలో అవుట్ అయ్యాడు. ఇక్కడి నుంచి టీమిండియా ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. వరుస విరామాల్లో టీమిండియా వికెట్లు కోల్పోయింది. 34 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ 15వ ఓవర్ రెండు బంతికి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా(17), రిషభ్ పంత్(17), దీపక్ హుడా(3) మరోసారి విఫలం అయ్యారు. దీంతో టీమిండియా చివరి ఓవర్లలో ఆశించిన పరుగులు రాలేదు. అశ్విన్(15) చివరి ఓవర్‌లో భారీ సిక్స్‌తో పర్వాలేనిపించాడు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లకు టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై కష్టసాధ్యంకానీ లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు నిస్సంకా(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 52), కుసల్ మెండిస్(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 57) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. టీమిండియాకు తొలి వికెట్ 12వ ఓవర్‌లో దక్కింది. నిస్సంకాను చాహల్ అవుట్ చేయడంతో తొలి బ్రేక్‌త్రూ అందింది. ఇక్కడి నుంచి శ్రీలంకను టీమిండియా స్పిన్నర్లు చాహల్, అశ్విన్ కాస్త ఇబ్బంది పెట్టినా.. టీమిండియాను ఓటమి నుంచి గట్టేక్కించలేకపోయారు. దీంతో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. దాదాపు ఆసియా కప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో చాహల్ మూడు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.
కాగా.. ఈ ఓటమితో టీమిండియాకు ఆసియా కప్ ఫైనల్ ఆడే అవకాశాలు ఇంకా మూసుకుపోలేదు. కానీ.. టీమిండియా ఫైనల్ ఆడాలంటే చాలా సమీకరణాలు కుదరాలి. ముందుగా శుక్రవారం అఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా భారీ తేడాతో ఘన విజయం సాధించాలి. అలాగే పాకిస్థాన్‌పై శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ గెలవాలి. అప్పుడు.. శ్రీలంక మూడు విజయాలు 6 పాయింట్లతో సూపర్ ఫోర్‌లో అగ్రస్థానంలో నిలుస్తుంది. టీమిండియా, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ ఒక్కో గెలుపుతో ఉంటాయి. మంచి నెట్ రన్‌రేట్ ఉన్న టీమ్ రెండో స్థానంలో నిలిచి ఆసియా కప్ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. ఇది జరగడం కష్టమే అయినా.. అసాధ్యం అయితే కాదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: శ్రీలంకపై టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు!
Sri Lanka seal a tense win to top Super Four table in #AsiaCup2022 🔥#INDvSL | 📝 Scorecard: https://t.co/914FlwDKK0 pic.twitter.com/t3lhQ5PE9k
— ICC (@ICC) September 6, 2022
Unbeaten Sri Lanka retains the top spot in Super 4 round points table.#AsiaCup #SLvIND
Coverage Powered by Emerald
More 👉 https://t.co/ZG1U0JUpG6 pic.twitter.com/HkLsXXG2c1
— ThePapare.com (@ThePapareSports) September 6, 2022