చరిత్రలో తొలిసారి పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘాన్‌ను చాలా తక్కువ అంచనా వేసిన పాకిస్థాన్.. రెండో శ్రేణి జట్టును పంపి చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఆఫ్ఘనిస్థాన్ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌పై తొలిసారి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. ఈ సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌పై ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా గెలవని ఆఫ్ఘనిస్థాన్.. ఇప్పుడు ఏకంగా సిరీస్‌ను కైవసం చేసుకోవడం విశేషం. యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడ టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆఫ్ఘాన్ సంచలన విజయం నమోదు చేసింది. అంతకుముందు 24వ తేదీ శుక్రవారం షార్జాలోనే జరిగిన తొలి టీ20లో ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించిందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆఫ్ఘాన్.. పాకిస్థాన్‌పై తొలి అంతర్జాతీయ విజయాన్ని నమోదు చేసి కొత్త చరిత్రకు నాందిపలికింది.
తొలి విజయం అందించిన ఉత్సాహంతో అదే జోరును రెండు టీ20లోనూ కొనసాగించి.. పాకిస్థాన్‌పై సిరీస్ విజయంతో కొత్త చరిత్రను లిఖించింది. ఈ నెల 27న జరగనున్న చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే.. పాక్‌ను క్లీన్ స్వీప్ చేసి.. ఆఫ్ఘాన్ చరిత్ర తిరగరాయనుంది. ఆ మ్యాచ్‌లో ఓడినా.. 2-1తో కప్ ఎత్తనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఇమద్ వసీమ్ ఒక్కడే 64 పరుగులతో రాణించాడు. కెప్టెన్ షాదాబ్ ఖాన్ 32 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. దీంతో పాక్ 130 పరుగులకే పరిమితం అయింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫరూఖీ 2, నవీన్ ఉల్ హక్, కెప్టెన్ రషీద్ ఖాన్, కరీమ్ తలో వికెట్ తీసుకున్నారు.
ఈ సిరీస్‌కి ముందు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అదరగొట్టిన సైమ్ అయ్యూబ్, షఫీక్, అజమ్ ఖాన్ దారుణంగా విఫలం అయ్యారు. షఫీక్ అయితే..అత్యంత ఘోరంగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో డకౌట్ అయి చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. 19.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఆఫ్ఘాన్ ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ 44, ఇబ్రహీం జద్రాన్ 38, నజీబ్ ఉల్లా జద్రాన్ 23 పరుగులతో రాణించారు. చివర్లో మాజీ కెప్టెన్ మొహమ్మద్ నబీ 9 బంతుల్లో విలువ 14 పరుగులు చేసి ఆఫ్ఘనిస్థాన్‌ను గెలిపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో నజీబ్‌ఉల్లా ఏకంగా 17 పరుగుల బాదడంతో ఆఫ్ఘాన్‌కు విజయం సులువైంది. మరి ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What a momentous occasion for Afghanistan cricket! 🙌😍
AfghanAtalan have created history by securing their first-ever T20I series win over traditional rivals Pakistan. It’s a triumph of grit, courage, and teamwork. pic.twitter.com/nQ7jjqmm14
— Afghanistan Cricket Board (@ACBofficials) March 26, 2023