క్రీడా మైదానంలో ఆటగాళ్లు కొన్ని కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతుంటారు. ఇక ఆ సమయంలోనే తమ నోటికి పనిచెప్పటం మనం చాలా సార్లే చూశాం. తోటి ఆటగాళ్ల మీదే కాక.. అంపైర్లపై మాటలతో విరుచుకుపడటం కూడా మనం చూశాం. తాజాగా అంపైర్ ని తిట్టడంతో ఐసీసీ ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ను మందలించింది. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఈ సంఘటన జరిగింది. ఫించ్ తిట్టిన బూతులన్ని స్టంప్ మైక్ లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బ్రిటీష్ జట్టు 8 పరుగుల తేడాతో ఆసిస్ పై గెలిచిన విషయం విదితమే. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. విషయంలోకి వెళితే.. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్ లో కామెరోన్ గ్రీన్ బౌలింగ్ వేస్తున్నాడు. స్ట్రైకింగ్ ఎండ్ లో బట్లర్ ఉన్నాడు. గ్రీన్ వేసిన బంతి బట్లర్ ఆడే ప్రయత్నం చేయగా అది బ్యాట్ కు తగలకుండా కీపర్ వేడ్ చేతిలో పడింది. దాంతో బ్యాట్ కు బాల్ తగిలింది అనుకుని ఆసిస్ ఆటగాళ్లు అందరు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ దాన్ని నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో ఫించ్ అసహనం వ్యక్తం చేస్తూ.. అంపైర్ దగ్గరికి బూతులు తిడుతూ వచ్చాడు. అక్కడికి వచ్చాక కూడా అసభ్యకర రీతిలో తిట్లు తిట్టాడు. ‘ఐ వుడ్ హ్యావ్ ఫ**క్ నైస్ ఇన్ టైమ్’ అన్న తిట్లన్ని స్టంప్ మైక్ లో రికార్డు అయ్యాయి. దాంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కండెక్ట్ లెవల్-1 కింద ఐసీసీ నిబంధనలు ఉల్లఘించినట్లే అని పేర్కొంది.
ఇక అంతర్జాతీయ మ్యాచ్ లో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఐసీసీ ఆర్టికల్ 2.3 కోడ్ ఆఫ్ కండక్ట్ కింద జరిమానా విధించాల్సింది. కానీ ఇప్పటికి కేవలం హెచ్చరిక మాత్రమే చేస్తున్నామని స్పష్టం చేసింది. ఇక ముందు ఇలాంటివి రిపీట్ అయితే.. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు జరిమానా కూడా విధిస్తామని వివరించింది. ఇలాంటి దురుసు ప్రవర్తనలు ఆటగాళ్లు చేసినప్పుడు వారి ర్యాంకింగ్స్ పాయింట్లలో కోత కోయడం సహజమే. అలాగే ఫించ్ కు సైతం ఒక పాయింట్ కోత విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఫించ్ అంపైర్ ను తిట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.”ఫించ్ మామా ఇది గల్లీ క్రికెట్ కాదు.. జర చూసుకోరాదే” అంటే.. అంపైర్లను గౌరవించడం నేర్చుకోండి.. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దం” అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
“It would have been f***ing nice to know in time.”
Aaron Finch swearing at the umpire against England, after asking whether a ball had carried to Matthew Wade as he considered a review. Finch has been given an official reprimand by the match referee, but avoided a fine. pic.twitter.com/Pm3AR1VmaR
— Jack Snape (@jacksongs) October 10, 2022
Aaron Finch was found to have used inappropriate language during the ninth over of England’s innings.
More 👇https://t.co/sNMglqqO67
— ICC (@ICC) October 11, 2022