టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభానికి ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్ తగిలింది. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో పాక్ చిత్తుగా ఓడింది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా పాక్-కివీస్ మధ్య మంగళవారం రెండో టీ20 జరిగింది. కివీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన పాక్.. రెండో మ్యాచ్‌లో మాత్రం దారుణ ఓటమిని చవిచూసింది. ఇప్పటికే ఆసియా కప్ 2022 ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమి, స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్ అజమ్ సేన.. ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాజయం చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి పాకిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 130 పరుగలు మాత్రమే చేసింది. ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా 30 పరుగుల మార్క్‌ను దాటలేదు. 27 పరుగులు చేసి ఇఫ్తికర్ అహ్మెద్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. రిజ్వాన్ 16, బాబర్ అజమ్ 21, మసూద్ 14, షాదాబ్ ఖాన్ 8, హైదర్ అలీ 8, ఆసీఫ్ అలీ 25(నాటౌట్), నవాజ్ 0, వసీమ్ జూనియర్ 1(నాటౌట్) దారుణంగా విఫలం అయ్యారు. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం. కివీస్ బౌలర్లలో సౌథీ 2, సాంట్నర్ 2, బ్రేస్‌వెల్ 2, సోధీ ఒక వికెట్ పడగొట్టారు.
ఇక స్వల్ప లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు తొలి మ్యాచ్ ఓటమికి బదులు తీర్చుకుంటూ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఫిన్ అలెన్ సిక్సులతో పాక్ బౌలర్లను చీల్చిచెండాడు. 42 బంతుల్లో ఒక ఫోర్, 6 సిక్సులతో 62 పరుగులు చేసిన అలెన్ 14వ ఓవర్‌లో షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వె 46 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసి మిగతా పనిని పూర్తి చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్(9 నాటౌట్)తో కలిసి 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ ఒక్కడికే ఒక వికెట్ దక్కింది.
A 117-run opening partnership between @FinnAllen32 (62) & Devon Conway (49*) sees the team to victory in Match 4 of the T20 Tri-Series 🏏
Scores | https://t.co/3D2LGOOdCz#NZvPAK pic.twitter.com/CtbAGLBnCG
— BLACKCAPS (@BLACKCAPS) October 11, 2022