పొట్టి ప్రపంచకప్ పోరు మొదలైంది. తొలి మ్యాచులో మిత్ర దేశం శ్రీలంక నమీబియా చేతిలో 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అంచనాలకు దరిదాపుల్లో కూడా లేని నమీబియా జట్టు.. సమష్టిగా రాణించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి తొలి పోటీనే చక్కటి ఉదాహరణ. ఇదిలా ఉంచితే.. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా రెండు వామప్ మ్యాచ్‌ల కోసం బ్రిస్బేన్ చేరుకుంది. ఈ క్రమంలో హిట్ మ్యాన్ 11 ఏళ్ల కుర్రాడితో బౌలింగ్ వేపించుకొని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది.
అధికారిక వామప్ మ్యాచుల కోసం బ్రిస్బేన్ చేరుకున్న టీమిండియా తొలుత ఆస్ట్రేలియాతో, అనంతరం న్యూజిల్యాండ్‌తోనూ వామప్ మ్యాచులు ఆడతుంది. ఈ క్రమంలో ఇప్పటికే బ్రిస్బేన్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు గబ్బా వేదికగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అదే సమయంలో అక్కడ సుమారు వందమందికి పైగా పిల్లలు క్రికెట్ ఆడుతూ కనిపించారు. వారిలో దృశీల్ చౌహాన్ అనే 11 ఏళ్ల చేస్తోన్న బౌలింగ్ తీరును చూసి మెస్మరైజ్ అయ్యాడు హిట్‌మ్యాన్. వెంటనే అతణ్నిపిలిపించుకొని బౌలింగ్ చేయించుకున్నాడు. ఆ బాలుడు సంధించిన కొన్ని ఇన్ స్వింగర్ యార్కర్లను ఆడలేకపోయాడు రోహిత్. కొన్ని ఓవర్ల తరువాత..హిట్ మ్యాన్ ఆ బాలుడిని డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లి టీమ్ మేట్స్‌కు పరిచయం చేశాడు. తాను సంతకం చేసిన కొన్ని ఫొటోలను అతనికి గిఫ్ట్‌గా అందించాడు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది.
Remember the name Drushil Chauhan !!
this 11 year old young boy will do something big in future because his talent is recognized by GOAT Rohit Sharma.
Truly India is blessed to have a humble person like Rohit Sharma as captain.@ImRo45 🙌❤ pic.twitter.com/KdG14pjPs7— Jyran⚘ (@Jyran45) October 16, 2022
దృశీల్ చౌహాన్.. భారత సంతతి పిల్లాడు. అతడి తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. చివరగా ‘నువ్ ఇండియా వెళ్లకపోతే.. ఎలా దేశానికి ఆడతావంటూ..’ ప్రశ్న సంధిస్తాడు. అందుకు బదులుగా ఆ పిల్లాడు..’ఇండియా వెళ్తాను.. కానీ, ఎప్పుడన్నది తెలియదు..’ అని సమాధానమిస్తాడు. రోహిత్ శర్మ చర్యల పట్ల నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. క్రికెటింగ్ సూపర్ స్టార్‌గా ఉంటోన్న రోహిత్.. ఓ బాలుడి టాలెంట్‌ను మెచ్చుకోవడం పట్ల అభినందిస్తోన్నారు. కాగా, ఇప్పటికే వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు వామప్ మ్యాచులు ఆడిన భారత్ ఒక దాంట్లో గెలిచి.. మరొక దాంట్లో ఓటమి పాలైంది. కాగా, భారత జట్టు తన తొలి మ్యాచులో దాయాది జట్టైనా పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 23న జరగనుంది.