టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్ర నేటితో 48వ రోజుకి చేరుకుంది. 48వ రోజు పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని జోగన్నపేట విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్ర నేటితో 48వ రోజుకి చేరుకుంది. 48వ రోజు పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని జోగన్నపేట విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. సెల్ఫీల కార్యక్రమం తర్వాత లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు. రోజూలాగానే ఈరోజు సుమారుగా వెయ్యి మందికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. తనని కలవడానికి వచ్చిన ప్రజలను, యువతను ఆప్యాయంగా పలకరించి..సెల్ఫీ ఇచ్చారు. లోకేశ్ ఓపికగా వచ్చిన అందరితో సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జోగన్నపేట వద్ద ప్రజలతో మమేకమవుతూ లోకేశ్ పాదయాత్ర ముందుకు సాగింది.
టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. జనం పెద్ద సంఖ్యలో లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. లోకేష్ ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇక, పాదయాత్ర 48వ రోజుకు చేరుకుంది. 48వ రోజు పాదయాత్ర జోగన్నపేట విడిది కేంద్రంనుంచి ప్రారంభం అయింది. ఇవాళ మోటుకుపల్లి పీవీఆర్ గ్రాండ్ ఫంక్షన్ హల్ లో ముస్లీంలతో జరిగిన ముఖాముఖి సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు.
ఈక్రమంలో పలువురు ముస్లీంలు తమకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం జరుగుతుందని లోకేశ్ తో తెలిపారు. వైసిపి పాలనలో ముస్లీంలపై దాడులు పెరిగిపోయాయని, తమ రక్షణ కోసం ప్రత్యేక చట్టం కావాలని వారు కోరారు. లోకేశ్ మాట్లాడుతూ.. ముస్లీంలను జగన్ మోసం చేశారని.. తమ ప్రభుత్వ రాగానే ముస్లింలను అన్ని విధాల ఆదుకుంటామని లోకేశ్ తెలిపారు. అలానే ఈ రోజు ఏపీ అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల వివాదంపై లోకేశ్ సీరియస్ అయ్యారు. దళితలుపై వైసీపీ దమన కాండ అసెంబ్లీలోనూ కొనసాగిందని ఆయన అన్నారు. దళిత ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామిపై దాడి చేయించడం దారుణమని లోకేశ్ అన్నారు.
ఈ దాడి ద్వారా తన ప్రయాణం నేరాలతోనే.. తన యుద్ధం దళితులపైనే అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని లోకేశ్ విమర్శించారు. మోటుకుపల్లి పీవీఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో బీసీ సామాజిక వర్గం ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను లోకేశ్ కు తెలియజేశారు. గౌడ కులస్తులకు టిడిపి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందేవని, వాటిని జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని బీసీ నేతలు అన్నారు. జగన్ పాలన వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సమావేశంలో పాల్గొన్నవారు తెలిపారు.
లోకేశ్ స్పందిస్తూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలను అన్ని రకాలుగా ఆదుకుంటామని, అలానే టిడిపి ప్రభుత్వం గెలిచిన ఏడాది లో కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని లోకేశ్ తెలిపారు. జగన్ కి సౌండ్ ఎక్కువ పని తక్కువని, కదిరిలో టిడిపిని గెలిపిస్తే అభివృద్ది అంటే ఏంటో చేసి చూపించే బాధ్యత తనదని లోకేశ్ అన్నారు. మరి.. 48వరోజు సాగిన లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.