పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా లోక్ సభ సెక్రటరీ జనరల్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో మోదీకి సంబంధించి మరో వివాదం తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు..
మోదీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలు అంటూ 2019 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆయన ఎంపీ పదవికి ఎసరు పెట్టాయి. రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు నమోదవ్వగా.. తాజాగా ఈ కేసుకు సంబంధించి సూరత్ కోర్టు.. ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో లోక్‌సభ సెక్రటరీ జనరల్.. శుక్రవారం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో తాజాగా మరో వివాదం తెర మీదకు వచ్చింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ప్రధాని నరేంద్ర మోదీపై కూడా అనర్హత వేటు వేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకు ఏంటా వివాదం.. అంటే..
2018లో నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరిని ఉద్దేశించి.. లోక్ సభలో శూర్పణఖ అని సంబోధించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై రేణుకా చౌదరి.. మోదీపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తాను ప్రధాని మోదీపై పరువు నష్టం కేసు వేయబోతున్నానని.. మరి ఇప్పుడు కోర్టులు ఎంత త్వరగా స్పందిస్తాయో చూద్దామంటూ ఆమె ట్వీట్ చేశారు. నాడు లోక్ సభలో మోదీ.. రేణుకా చౌదరిని ఉద్దేశించి.. ఆమె నవ్వును ‘రామాయణం’ సీరియల్ ‘శూర్పణఖ’తో పోల్చారు. ఇందుకు సంబంధించిన పాత వీడియోను రేణుకా చౌదరి తాజాగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.
ఇక రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సమయంలోనే రేణుకా చౌదరి పాత వివాదాన్ని తెర మీదకు తేవడంతో.. ఇది మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇక నెటిజనులు కూడా రాహుల్ గాంధీకి జైలు శిక్ష వేశారు.. అనర్హత వేటు కూడా వేశారు. నిజంగానే రేణుకా చౌదరి.. మోదీపై పరువు నష్టం కేసు వేస్తే.. కోర్టులు ఇంత త్వరగా స్పందిస్తాయా.. మోదీకి జైలు శిక్ష వేస్తాయా.. ఆయనపై అనర్హత వేటు విధించగలారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కన్నా.. ఓ మహిళ గురించి మోదీ చేసిన వ్యాఖ్యలే తీవ్రం. మరి బీజేపీ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. రేణుకా చౌదరి కేసు పెడితే.. మోదీకి శిక్ష పడి.. అనర్హత వేటు పడుతుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This classless megalonaniac referred to me as Surpanakha on the floor of the house.
I will file a defamation case against him. Let’s see how fast courts will act now.. pic.twitter.com/6T0hLdS4YW
— Renuka Chowdhury (@RenukaCCongress) March 23, 2023