తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును వాడొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ స్కాంలో మధ్యంతర ఇంజెక్షన్ ఆర్డర్ ను కోర్టు ఇచ్చింది. కవితపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మకు కోర్టు నోటిసులు ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి మీడియాలో, సోషల్ మీడియాలో కూడా కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13 కు వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఉద్దేశ పూర్వకంగా నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసిన తన ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే కవిత పిటిషన్ పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు.. తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరి.. సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.