సినీ హీరోలు, రాజకీయ నేతలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని వారి అభిమానులు ఎప్పుడు ఆసక్తి ఎదురు చూస్తుంటారు. చాలా మంది హీరోలు, రాజకీయ నేతలు గతంలో ఎంతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. అలానే తాజాగా యంగ్ టైగర్ యన్టీఆర్, మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించిన ఓ పాత ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం వీరు ముగ్గురు ఉన్న పరిస్థితుల కారణంగా ఈ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది. క్షణాల్లో లైక్స్ , కామెంట్స్ తో హోరెత్తిపోతుంది. ఒకప్పుడు ఎన్టీఆర్, కొడాలి నాని, వంశీ ల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందనటానికి ఆ ఫోటో ఒకటి చాలు. ఇక ఫోటో విషయానికి వస్తే అందులో జూనియర్ యన్టీఆర్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గవన్నరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ముగ్గురు కూర్చిల్లో పక్కపక్కన కూర్చున్నారు. కొడాలి నాని మధ్యలో ఉండగా.. ఇరువైపుల వంశీ, ఎన్టీఆర్ లు ఉన్నారు. నానికి ఓ వైపు యన్టీఆర్ కూర్చున్నాడు. అంతే కాక తన కాలిని కొడాలి నాని కాలిపై వేసి మరీ కూర్చునారు. అయితే అదే ఏమి పట్టించుకోని నాని.. ఎందో విషయం గురించి తీక్షణంగా ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇక వీరిద్దిరి చిలిపితనం చూస్తున్న వల్లభనేని వంశీ చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అయితే ఆ ముగ్గురి మధ్య ఎలాంటి స్నేహం ఉందనటానికి ఇదో పెద్ద నిదర్శనం అని కొందరు అభిప్రాయాపడుతున్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని నందమూరి హరికృష్ణకు ప్రియ శిష్యులన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయనంటే వారికి ఎనలేని అభిమానం. ఈ కారణంగానే ఏ పార్టీలో ఉన్నా.. హరికృష్ణ వచ్చారంటే నాని గానీ, వంశీ గానీ ఆయన వెన్నంటే నడిచేవారు. కొడాలి నాని, వంశీ ఇద్దరూ హరికృష్ణ పిలుపుతో టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. టీడీపీలో ఉన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో వీరిద్దరు చాలా సన్నిహితంగా మెలిగేవారు. అయితే ప్రస్తుతం నాని, వంశీ లు అధికార పార్టీ వైసీపీలో ఉన్న నేపథ్యంలో వారితో జూనియర్ యన్టీఆర్ కలిసి ఉన్న ఈ పాత ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్ కావడం గమనార్హం. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ ఫోటో పై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Unseen Pic Of @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/1WXvoKsXVC — NTR Trends (@NTRFanTrends) August 24, 2022 ఇదీ చదవండి: సౌందర్యతో ఎఫైర్.. ‘మా మధ్య అలాంటి బంధం ఉండేది’: జగపతి బాబు ఇది చదవండి: చిరంజీవి చుట్టూ ఏపీ పాలిటిక్స్! ఇది మెగాస్టార్ రేంజ్!