ఏపీలో కేబినెట్ విస్తరణ గురించి గత కొన్ని రోజులుగా ఏదో ఓ వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న చాలా మందిని పదవి నుంచి దింపి.. కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారని.. దీని గురించి జగన్ ఇప్పటికే మంత్రులకు క్లియర్‌గా చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రిగా ప్రతిపక్ష నేతను టార్గెట్ చేయటంలో ముందుండే కొడాలి నాని కేబినెట్ లో కొనసాగుతారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే తాజగా ఆయన చేసిన వ్యాఖ్యలతో దీని పైన క్లారిటీ వచ్చేసింది.
ఇది కూడా చదవండి: పదో తరగతి ఫెయిల్ అయినా ఎమ్మెల్యేగా గెలిచా : మంత్రి కొడాలి నాని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద మార్కుల కోసం పాకులాడాల్సిన అవసరం తనకు లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. జగన్ వద్ద ఎలా మార్కులు వేయించుకోవాలో తనకు బాగా తెలుసన్నారు. తనకు మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి కూడా అవసరం లేదని, బతికినంత కాలం జగన్‌తోనే వుంటానని కొడాలి నాని స్పష్టం చేశారు. ఓ రకంగా తనకు మంత్రి పదవి అడ్డమని.. అది లేకపోతే.. ప్రతిపక్షాలు తన విశ్వరూపం చూస్తాయని అన్నారు. తాను ఏది మాట్లాడినా… ప్రభుత్వానికి అంటగడతారని, అదే ఏ పదవీ లేకపోతే.. తన విశ్వరూపం ఏమిటో తెలుస్తుందన్నారు. ఏ పదవీ ఆశించి, తాను వైసీపీలోకి రాలేదన్నారు. బతికినంత కాలం జగన్‌తోనే ఉంటానని తెలిపారు. గుడివాడలో వరుసగా నాలుగు సార్లు గెలిచానని చెబుతూ.. 2024 లో మరోసారి ఖచ్చితంగా గెలుస్తానని కొడాలి నాని ధీమా వ్యక్తం చేసారు.
ఇది కూడా చదవండి: ఏ గ్రౌండ్ లో కొట్టుకుందాం? కొడాలి నానికి జలీల్ ఖాన్ సవాల్!మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ కుటుంబం అనాథ అవుతుందని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా, అధికారికంగా దోచుకోవాలని చూస్తోందని ఆరోపించారు. మూడో తరానికి కూడా చంద్రబాబు అన్యాయం చేయాలని చూస్తున్నారని నాని ఆరోపించారు. వారిని కాపాడుకోవడం కోసమే.. చంద్రబాబు అనే రాక్షసుడిని సంహరించగల నాయకుడు జగన్ మాత్రమే అని నమ్మి.. వైసీపీలో చేరానని కొడాలి నాని స్పష్టం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ చివరి క్షణంలో చెప్పిన మాటలను ప్రజలకు గుర్తు చేయడం కోసం పదే పదే మీడియా ముందుకు వస్తున్నానని తెలిపారు. దేవినేని ఉమా, చంద్రబాబు పందికొక్కులు అంటూ నాని విమర్శించారు. అంతేకాక చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు పేరు చెబితే ప్రజలు ఓటు వేయరని తెలిసి, మళ్లీ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొడాలి నాని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఈ రోజే ఎన్నికలకు వెళదాం.. అతడు గెలిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా: శివాజీ
ఇక, కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే.. రానున్న రోజుల్లో కొడాలి నాని వర్సెస్ టీడీపీగా రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారతాయి అంటున్నారు విశ్లేషకులు. కొడాలి నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.