యంగ్ అండ్ ఎనర్జటిక్, టాలెంటెడ్ టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘సమ్మతమే’. గోపీనాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి, సితార, శివన్నారాయణ ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్ 24న విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తో అలరించింది. మ్యూజిక్ పరంగా ఈ సినిమాకి మంచి టాక్ లభించింది.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెండు వారాల్లోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను ఆహా అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమా జులై 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు.
ఇంక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.. ‘నేను బాగా కావాల్సిన వాడిని’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కిరణ్ అబ్బవరం నటించిన సమ్మతమే సినిమా ఓటీటీ రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Krishnudi leelalu, Sathyabhama alakalu kathale vinamu ipativaraku kani ade role reverse aithe?#SammathameOnAHA premieres July 15.@Kiran_Abbavaram @iChandiniC #GopinathReddy #DivyaSree pic.twitter.com/DQ4v2zlCha
— ahavideoin (@ahavideoIN) July 6, 2022