సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలే అద్భుతాలు సృష్టిస్తుంటాయి. అలా రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న సినిమా ‘కాంతార‘. చిన్న సినిమాగా కన్నడలో మాత్రమే ముందుగా విడుదలైన కాంతార మూవీ.. హైలీ పాజిటివ్ టాక్ తో ఇతర భాషల్లోకి డబ్ అయ్యింది. సెప్టెంబర్ 30న కాంతార కన్నడ వెర్షన్ రిలీజ్ కాగా.. రెండు వారాల తర్వాత తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఇక తెలుగు విషయానికి వస్తే.. అక్టోబర్ 15న కాంతార తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కేవలం 2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కాంతార.. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయడం విశేషం.
ఈ క్రమంలో తెలుగుతో పాటు విడుదలైన అన్ని భాషల్లో కాంతార సూపర్ హిట్ టాక్, కలెక్షన్స్ రాబడుతోంది. అయితే.. కర్ణాటకలోని తుళు తెగకు చెందిన భూతకోలం, కంబళ అనే కథాంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం.. అక్కడి తెగకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలను ప్రస్తావించడం మరో విశేషం. ఇక కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన కాంతార.. క్లైమాక్స్ పరంగా ప్రేక్షకులకు మంచి థ్రిల్ కలిగించిందని చెప్పవచ్చు. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు ఈ సినిమాను తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. అయితే.. బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల గ్రాస్ దాటి దూసుకుపోతున్న కాంతార చిత్రం కోసం.. ఓటిటి ప్రేక్షకులు సైతం ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంతార మూవీ డిజిటల్ రైట్స్, స్ట్రీమింగ్ గురించి సినీ వర్గాలలో పలు వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. కాంతార చిత్ర ఓటిటి హక్కులను దిగ్గజ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమా ఒరిజినల్ కన్నడ వెర్షన్ ని నవంబర్ 4 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. కాంతార కన్నడ వెర్షన్.. మిగతా భాషలకంటే రెండు వారాలు ముందుగా విడుదలైంది. కాబట్టి.. కన్నడ వెర్షన్ ఓటిటి రిలీజ్ అయ్యాక మరికొద్ది రోజులకు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. మరి దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.