కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇటివల కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని కంఠీరవ స్టూడియోలో ఖననం చేసిన విషయం తెలిసిందే. సాంప్రదాయం ప్రకారం సమాధికి కుటుంబ సభ్యులు ఐదు రోజుల పాలశాస్త్రం పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆయన ఇష్టపడే ఇడ్లి, రాగిముద్ద, నాటుకోడి సాంబారుతో పాటు 50 రకాల వంటకాలను సమాధిపై పెట్టి పూజలు చేశారు.
భార్య అశ్విని, కూతుర్లు ధృతి, వందితా, అన్నలు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు, మంత్రి గోపాలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా బుధవారం నుంచి పునీత్ రాజ్‌కుమార్ సమాధి సందర్శనకు అవకాశం కల్పించనున్నారు. పాల పూజల అనంతరం శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ… అప్పు సమాధి దర్శనానికి బుధవారం నుంచి అభిమానులను అనుమతి ఇస్తామని తెలిపారు. కాగా పునీత్ సమాధి దర్శనానికి భారీ సంఖ్యలో అభిమానులు వస్తారనే అంచనా ఉంది.