జీవింతంలో ఎంతో ముఖ్యమైనది భావించే వేడుకల్లో పెళ్లి ఒకటి. ఒకరకంగా మిగిలిన అన్ని వేడుకల కంటే వివాహ వేడుకే అతి ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. బంధువులు, మిత్రులు, సన్నిహితుల మధ్య జరిగే ఈ సెలబ్రేషన్స్ లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి వేడుకల్లో విషాదాలు నెలకొంటాయి.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన వేడుక. బాధ్యతలు, బంధుత్వాలు, ప్రేమ, అనురాగం.. ఇలా ఎన్నో విషయాలు వివాహ బంధంతో ముడిపడి ఉంటాయి. అప్పటివరకు ఒక్కరిగా జీవించిన వారు.. ఆ తర్వాత మరొకరితో జీవితాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. అందుకే మ్యారేజ్ సెలబ్రేషన్స్‌ను అందరూ గ్రాండ్‌గా జరుపుకుంటారు. కలకాలం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఇలాంటి వేడుకల్లో విషాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనే ఉత్తరాఖండ్‌లో జరిగింది. ఎన్నో ఆశలతో పెళ్లికి సిద్ధమైన యువకుడు.. వివాహ తంతు జరుగుతుండగా గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తరాఖండ్‌లోని రాణిఖేత్‌లో పెళ్లి సమయంలో వరుణు మరణించాడు. దీంతో అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి. హల్ద్వానీ, నందపుర్ కఠ్‌గరియాకు చెందిన సమీర్ ఉపాధ్యాయ్ (30) అనే యువకుడు డెంటిస్ట్. ఈ క్రమంలో రాణిఖేత్‌కు చెందిన ఓ యువతితో అతడికి పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం వివాహం కాగా.. కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య పెళ్లి కొడుకును ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పురోహితులు వివాహ తంతు ప్రారంభించారు. ఈ క్రమంలో వధూవరులతో ఏడడుగులు వేస్తుండగా సమీర్ ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో కుటుంబీకులు అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. కార్డియాక్ అరెస్టుతో సమీర్ ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.