సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఇలా మన హీరోలు ఆయా సినిమాల్లో యముడి మీద తిరుగుబాటు చేయడం చూశాం. ఏకంగా సమవర్తినే క్వశ్చన్ చేయడం చూశాం. సినిమాల వరకూ అది సరదాగానే ఉన్నా, ప్రాక్టికల్ గా అవేమీ వర్కవుట్ అవ్వవని మనకి తెలిసిందే. మరి సినిమాలని చూసి ఇన్స్పైర్ అయ్యాడో, లేక పాపులర్ అవుదామని చేశాడో తెలియదు గానీ.. ఓ రైతు ఏకంగా వానదేవుడైన ఇంద్రుడి మీద ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. గోండా జిల్లా ఝాలా గ్రామానికి చెందిన సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు.. వర్షం కురవని కారణంగా వానదేవుడైన ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలంటూ రాతపూర్వకంగా రెవెన్యు అధికారులకు ఫిర్యాదు చేశాడు.
సమాధాన్ దివాస్ (ఫిర్యాదు పరిష్కార దినం) సందర్భంగా ఆ రైతు ఇలా వింత ఫిర్యాదును సమర్పించాడు. “జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల జనజీవనంపై ప్రతికూల ప్రభావం పడింది. చాలా నెలలుగా వర్షాలు పడలేదు. కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కావున ఈ విషయంలో అధికారులు తగు చర్యలు తీసుకుని బాధ్యత వహించాలని” అధికారులను కోరాడు. రైతు రాసిన ఈ లేఖను ఎన్ఎన్ వర్మ అనే రెవెన్యు అధికారి చదవకుండానే డీఎం కార్యాలయానికి పంపాడు. వానదేవుడిపై చర్య తీసుకోవాలని పై అధికారులకు సిఫార్సు చేశాడు. ఈ లేఖ వైరల్ కావడంతో విమర్శలు వస్తున్నాయి.
దీంతో రెవెన్యు అధికారి వర్మ..తన వద్దకు ఎలాంటి లేఖ రాలేదని, నేను ఆ లేఖను ఫార్వార్డ్ చేయలేదని కొట్టి పారేశాడు. లేఖపై కనిపించే ముద్ర గురించి నెటిజన్లు అడుగగా.. ఆ లేఖపై కనిపించే ముద్ర నకిలీదంటూ వెల్లడించాడు. “సంపూర్ణ సమాధాన్ దివాస్ లో వచ్చిన ఫిర్యాదులు సంబంధిత విభాగాలకు నామినేట్ చేయబడతాయని, అలానే ఈ ఫిర్యాదులు ఏ ఇతర కార్యాలయాలకు పంపబడవని, కాబట్టి ఈ లేఖ అనేది కల్పితమని” వర్మ వెల్లడించాడు. కాగా, దీనిపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. అయితే ఈ లేఖలో అధికారి సంతకం, తదుపరి చర్య కోసం ఫార్వార్డ్ చేయబడిందని రాసిన కామెంట్ ఉంది. దీంతో వర్మ సిఫార్సు చేసిన విషయం నిజమే అయి ఉండవచ్చునని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ రైతు ఇంద్రుడిపై ఫిర్యాదు చేయడమే ఎక్స్ ట్రా అనుకుంటే, దాన్ని పై అధికారులకు ఈ వర్మ అనే అతను ఫార్వార్డ్ చేయడం ఇంకా ఎక్స్ ట్రా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రైతు ఫిర్యాదుపై అధికారులు ఇంద్రుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Krishna District: భర్త కూలీ.. ప్రియుడు పోలీస్! అత్యాశకి పోయి ఓ భార్య దారుణం!
ఇది కూడా చదవండి: దారుణం.. రూ.100 కోసం కన్నతండ్రి హత్య!