పోలీసు వ్యవస్థలో వాహనాలకు సరైన పత్రాలు, హెల్మెంట్ లేక పోతే చలానాలు విధించే అధికారం ఉంది. అందులో భాగంగానే ఓ వ్యక్తికి హెల్మెంట్ ధరించలేదని రూ. 6వేలు జరిమానా వేశారు. అయితే ఆ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన షాక్ మాములుగా లేదు. ప్రస్తుతం సదరు వ్యక్తి చేసిన పని వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
మెహతాబ్.. ఉత్తరప్రదేశ్ కు చెందిన విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. మెహతాబ్ తాజాగా హెల్మెంట్ లేకుండా బైక్ నడపడంతో అతడికి పోలీసులు రూ.6 వేలు జరిమానా విధించారు. అతడు పోలీసులను ఎంత బతిలాడినా వినలేదని వాపోయాడు. ఇక లాభం లేదని అతడు కోపంతో వచ్చి పోలీసు స్టేషన్ సర్వీస్ వైర్ ను కట్ చేశాడు. అతడు కరెంట్ కట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
దీనికి అతడు ఇచ్చిన సమాధానం ఏంటంటే? ఇప్పటికే ఈ పోలీసు స్టేషన్ పై రూ. 56 వేల రూపాయాల కరెంట్ బిల్లు బకాయిలు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక హెల్మెంట్ లేక పోతే యూపీలో రూ. 2వేలు జరిమానా విధించాలి గానీ ఇలా 6వేలు వేయడం ఏంటని మెహతాబ్ ప్రశ్నిస్తున్నాడు. ఓ సాధారణ కాంట్రాక్ట్ లైన్ మెన్ గా చేస్తున్నా నాకు ఇంత చలానా విధించడం కరెక్ట్ కాదని ఇక నుంచి విధిగా హెల్మెట్ ధరిస్తానని తెలిపాడు. ప్రస్తుతం అతడు పోలీసు స్టేషన్ కు కరెంట్ కట్ చేసే వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి ఈ సరదా సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
UP: Police cut lineman’s challan of 6 thousand in #Shamli, in response the lineman cut off the electricity of police station due to outstanding bill of 56 thousand#UttarPradesh #UPPolice #viral #viralvideo pic.twitter.com/CHhjF6dlXq
— Siraj Noorani (@sirajnoorani) August 24, 2022