సమాజంలో అనేక ఆచారాలు,వ్యవహారాలు, కట్టుబాట్లు ఉంటాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. అయితే కొన్ని ఆచారాలను, కొందరి నమ్మకాలను చూసినప్పుడు, విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. సాంకేతికంగా ఇంతలా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇంకా కొన్ని చోట్లు విచిత్రమైన ఆచారాలను అనుసరిస్తుంటారు. అయితే తాజాగా ముంబైలో జరిగిన ఓ సంఘటన ఇలాంటిదే. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అది ఏమిటంటే.. భార్యలు బతికుండగానే భర్తలు పిండాలు పెట్టారు. మరి భార్యలు బతికుండగానే పిండాలు ఎందుకు పెట్టారో ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందా..
మహారాష్ట్రలోని ముంబైలోని నది ఒడ్డున ఆదివారం రోజున పితృపక్షం, శ్రాద్ధ మాసం జరిగింది. అయితే ప్రతి ఏటా ఈ మాసంలో అక్కడి ప్రజలు చనిపోయిన వారికి పిండ ప్రదానం చేస్తారు. విచిత్రం ఏంటంటే.. ఈ సంవత్సరం 50 భర్తలు బ్రతికున్న తమ భార్యలకు పిండ ప్రదానం చేస్తూ, కనిపించారు. వివాహానికి సంబంధించిన చెడు జ్ఞాపకాలను వదిలించుకోవడానికి వీరంతా పూర్తి ఆచార సాంప్రదాయాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పిండ ప్రదానం సమయంలో కొందరు గుండు కూడా చేయించుకున్నారు. ఈ పిండ ప్రదాన కార్యక్రమాన్ని వాస్తవ్ అనే పౌండేషన్ నిర్వహించింది. పిండ ప్రదానం చేసిన భర్తలు మాట్లాడుతూ…”ఇలా భార్యలకు పిండ ప్రదానం చేస్తే.. వారు శాంతించి, మాకు విముక్తి కల్పిస్తారు. పెళ్లి సమయంలో దంపతులు ఏడడుగులు కలిసి నడుస్తామని ప్రమాణం చేస్తాం.
కానీ,ఎక్కువ జంటలు పెళైన కొద్ది రోజులకే చిన్న చిన్న వివాదాలతో కోర్టుమెట్లు ఎక్కుతున్నాయి. అయితే ఈ సమయంలో మహిళలకే మద్దతు వస్తోంది. భర్తల బాధను ఎవరు అర్ధం చేసుకోవడం లేదు. అందుకే భార్యా బాధిత భర్తలందరం కలిసి ఈ పిండ ప్రదానం చేస్తున్నాం. గతంలో ఈ ఫౌండేషన్ వారణాసిలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈసారి ముంబైలో ఈ పిండ ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల స్త్రీ వాదమనే విధానానికి కూడా తర్పణం వదులుతుంది. స్త్రీ వాదానికి ముగింపు పలికి, సమాజంలో స్త్రీ, పురుషుల సమానత్వం వస్తుంది”అని భార్యల బాధిత భర్తలు తెలిపారు. మరి.. ఈ విచిత్రమైన ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.