పోలీసులు అంటే ప్రజల్లో ఓ రకమైన అభిప్రాయం ఉంటుంది. విధి నిర్వహణలో వారు కఠినంగా వ్యవహరిస్తుంటారు. దీంతో పోలీసులకు జాలి, దయ వంటివి ఉండవని చాలా మంది అభిప్రాయా పడుతుంటారు. అయితే కొన్ని కొన్ని సంఘటన చూసినప్పుడు పోలీసుల్లోని మానవత్వం మనకు తెలుస్తోంది. వారి మాట మాత్రమే కఠినం.. మనస్సు వెన్న అనేలా అనిపిస్తాయి. తమిళనాడులో జరిగిన ఓ ఆసక్తికరమైన ఘటన అందుకు నిదర్శనం. అర్ధరాత్రి రోడ్డుపై పురిటీ నొప్పులతో అల్లాడుతున్న బిచ్చగత్తెను.. అటుగా వెళ్లతున్న ఓ పోలీస్ సాయం చేసి కాపాడింది. దీంతో ఆ మహిళ పండటి బిడ్డకు జన్మనిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని వెల్లూరులో షబానా అనే మహిళ తన పదేళ్ల కొడుకు తో కలసి బస్టాండ్‌లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. షబానాను ఆమె భర్త కొన్నాళ క్రితం వదిలేశాడు. ఇదే సమయంలో ఆమె గర్భవతి కాగా.. ఆస్పత్రికి వెళ్లేందుకు కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు. ఈక్రమంలో ఆదివారం అర్ధరాత్రి షబానా పురిటి నొప్పులు వచ్చాయి. నొప్పులకు తట్టుకోలేక రోడ్డుపైనే విల్లా విల్లాపోయింది. ఇదే సమంయలో డ్యూటీలో భాగంగా అటుగా వెళ్తున్న ఇళవరసి అనే హెడ్ కానిస్టేబుల్ షబానాను చూసింది. ఆమె పురిటి నొప్పులతో బాధపడుతున్నట్టు ఇళవరసి గుర్తించింది. దీంతో వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. ఫోన్ చేసి చాలా వరకు కూడా అంబులెన్స్ రాలేదు.
దీంతో ఇళవరసినే డాక్టర్ గా మారి ఆ మహిళకు సాయం చేసింది. దీంతో సదరు మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇళవరసి అలా తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. అన్నాసాలైలోని సౌత్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ ఇళవరసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వెల్లూరులో ఆదివారం నైట్ డ్యూటీకి వెళ్లారు. ఆ సమయంలో షబాను చూసి..సకాలం వైద్యం అందించి కాపాడింది. తల్లిబిడ్డను కాపాడిన ఈ ఇళవరసిపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు. పోలీస్ ఉన్నతాధికారులు ఆమెకు అభినందలు తెలిపారు.
ఇళవరసి మాట్లాడుతూ..” నేను వెళ్లి ఆమెను ఆస్పత్రిలో కలిశాను. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నన్ను కలవమని ఆమెకు చెప్పాను. తర్వాత మేము ఆమె కోసం ఓ ఇల్లు చూస్తాం.” అని చెప్పారు. ఇటీవలె ఓ రైల్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను వైద్య విద్యార్థి స్వాతిరెడ్డి ఆదుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇళవరసి అనే పోలీస్ కానిస్టేబులు మహిళను కాపాడి.. అందిరి ప్రశంసలు అందుకుంది. కాగా ప్రస్తుతం శిశువును ఎత్తుకుని ఇళవరసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Heartwarming! Cop helps woman give birth in Tamil Nadu’s Vellore https://t.co/nYj2yNSxl6 Heartwarming! Cop helps woman give birth in Tamil Nadu’s Vellore pic.twitter.com/wQTjd0Ew83
— Vishal verma (@Vishalverma111) September 18, 2022