నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటునే ఉంటాయి. అతి వేగం, తాగి నడపం, నిర్లక్ష్యంపు డ్రైవింగ్ వంటివే ప్రమాదాలకు ప్రధాన కారణం. అయితే ఈ ప్రమాదల్లో ఎందరో అమయాకులు ప్రాణాలు కొల్పోతున్నారు. మరికొందరు అవయవాలు కోల్పోయి జీవితాంతం బ్రతికున్న జీవిచ్ఛవాలా ఉంటున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో పసిపిల్లలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా కొట్టింది. ఈ హఠాత్పరిణామంతో బస్సులోని విద్యార్ధులు వణికిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై లో అంబర్ నాథ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రోటరీ అనే ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఉదయం 7.57 గంటలకు అంబర్ నాథ్ ఈస్ట్ గ్రీన్ సిటీ కాంప్లెక్స్ కు వచ్చింది. అప్పటికే అందులో చాలా మంది పిల్లలు ఉన్నారు. ఈ కాంప్లెక్స్ సమీపంలో ఓ భవనం ముందున్న ర్యాంప్ పై బస్సును రివర్స్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలోబస్సును వేగంగా రివర్స్ నడిపాడు. దీంతో స్కూల్ బస్సు అదుపు తప్పి అమాంతం బోల్తకొట్టింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులు , స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే బోల్తా పడిన బస్సు వైపు తల్లిదండ్రులు పరుగెత్తి పిల్లలను కాపాడారు. మరికొంతమంది విద్యార్థులు కూడా బస్సు దగ్గరకు పరుగులు తీశారు. కొందరు యువకులు బోల్తాపడిన బస్సుపైకి ఎక్కి పిల్లలను బయటకు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ముగ్గురు విద్యార్ధులకు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి. మిగిలిన విద్యార్ధులు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన నుంచి అందరు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేశారు. ఏదిఏమైనా తృటిలో పెను ప్రమాదం తప్పింది. జరిగిన ఈ ప్రమాదం అక్కడున్న సీసీ టీవీలో రికార్డయింది. అయితే ఈ ఘటనపై సదరు స్కూల్ యాజమాన్యం స్పందించింది. ఈ బస్సుకు, పాఠశాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ బస్సు ప్రైవేట్ దేనని, పిల్లల తల్లిదండ్రులు వారి సౌకర్యం కోసం ఈ బస్సును వినియోగిస్తున్నారని యాజమాన్యం తెలిపింది. ఆ బస్సు యజమానిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బస్సు బోల్తా పడిన ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
अंबरनाथमध्ये शाळेची स्कूल बस उलटली;विद्यार्थी थोडक्यात बचावले pic.twitter.com/Ht4Ke77iuy
— Lokmat (@lokmat) September 26, 2022