ఉపాధి కోసం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి.. ఏమయ్యాడో తెలియని పరిస్థితుల్లో ఏళ్ల తరబడి కుటుంబానికి దూరమయ్యాడు. చివరకు 22 ఏళ్ల తరువాత ఇంటికి వచ్చిన ఆయనను చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు. తన భర్త ఉన్న స్థితిని చూసి ఆయన భార్య అల్లాడిపోయింది.
మనిషి జీవితం అనేది బంధాలతో కలగలిపి ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు పరస్పరం ప్రేమానురాగాలు చూపించుకుంటారు. అందుకే ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగితే అందరూ బాధ పడుతుంటారు. అలానే కొన్ని సందర్భాల్లో తప్పి పోయి కుటుంబానికి దూరమవుతారు. వారి జ్ఞాపకాలతో కుటుంబ సభ్యులు బాధపడుతుంటారు. ఇక కనిపించకుండాపోయిన వ్యక్తి తిరిగి ఇంటికి చేరితే ఆ కుటుంబ సభ్యులు సంతోషం చెప్పలేనిది. అచ్చం అలాంటి ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. కుమారుడు మూడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు తప్పిపోయిన ఓ తండ్రి.. 22 ఏళ్ల తరువాత ఇంటికి చేరాడు. మరి.. ఆ కుటుంబానికి దూరం కావడానికి జరిగిన పరిస్థితులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బీహర్ రాష్ట్రంలోని దర్బంగా జిల్లా బిచ్చౌలి గ్రామానికి చెందిన రమాకాంత్ ఝా ఉన్న చోట పని దొరక్క అతడు తన భార్యను మూడేళ్ళ కుమారుడిని ఇంట్లో వదిలేసి అతడు రైలులో హరియాణకు పయనమయ్యాడు. రైలు అనంతరం అంబలా స్టేషనులో ఆగింది. ఈ సమయంలో రమాకాంత్ నీళ్లబాటిలు కొనడానికి రైలు దిగాడు. ఆ బాటిల్ తీసుకొనేలోపు అక్కడి నుంచి రైళ్లు వెళ్ళిపోయింది. దీంతో ఇంటికి ఎలా వెళ్లాలో అతనికి దిక్కు తోచలేదు. అలానే తిరుగుతూ, ఆకలితో అల్లాడుతూ అతని మానసిక స్థితి మరింత దిగజారింది.
అతనికి ఏం చేయాలో దిక్కు తోచక రోడ్డు పక్కన ఏది దొరికితే అది తింటూ జీవనం సాగించేవాడు. మరోవైపు రమాకాంత్ కుటుంబ సభ్యులు అతని కోసం పలు ప్రాంతాల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఇక వీధుల్లో పిచ్చివాడిగా తిరుగుతున్న రమకాంత్ ను కర్నాల్ లో ఉండే ఆషియానా స్వచ్చంద సంస్ధ డైరెక్టర్ రాజ్ కుమార్ కంట్లో పడ్డాడు. రాజ్ కుమార్ తన ఇంటికి రమాకాంత్ ను తీసుకెళ్లి.. మంచి ఆహారం, సరైన వైద్యం అందించారు. ఇలా జరుగుతున్న సమయంలో రమాకాంత్ కు తన గతం గుర్తుకు వచ్చింది.
తన కుటుంబ సమాచారాన్ని రాజ్ కుమార్ కి తెలిపాడు. ఆయన దర్బంగా జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా జరిగిన సమాచారం అంతా తెలియజేశారు. చివరకు రమాకాంత్ తన భార్య బిడ్డలను కలుసుకున్నాడు. దాదాపు 22 ఏళ్ల సుదీర్ఘ ఎడబాటు తర్వాత బుధవారం తన కుటుంబాన్ని కలవడంతో సంతోషం వ్యక్తం చేశాడు. మూడేళ్ల బాలుడిగా చూసిన తన కొడుకు ఇప్పుడు పెద్దగా అయి యాపీఎస్సీ పరీక్షలకు సన్నదం అవుతుండటం చూసి రమాకాంత్ ఆనంద భాష్పాలార్చారు. మరి.. రమాకాంత్ ఎమోషనల్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.