అంగవైకల్యం ఉన్న ఓ విద్యార్థి అనుకున్నది సాధించాడు. అత్యున్నత ఆశయం వైపు మరో ముందడుగు వేశాడు. 17 ఏళ్ల దివ్యాంగుడు తన 12వ తరగతి బోర్డు పరీక్షను ఎడమ కాలుతో రాసి.. విధినే ఎదిరించాడు. అపజయలతో కుంగిపోయే యువతకు ఆ దివ్యాంగుడు ఆదర్శంగా నిలిచాడు.
శరీరంలోని అన్ని అవయవాలు బాగుండే వారిలో చాలా మంది జీవితంలో ఎదురయ్యే కష్టాలకు భయపడతున్నారు. కొందరు ఒకటి, రెండు అపజయాలు చూడగానే తీవ్ర నిరాశలోకి వెళ్లిపోతారు. ఇక తాము దేనికి పనికిరామని, జీవితమే వృథా అనే స్థితిలోకి వెళ్తుంటారు. సమస్యలకు భయపడి ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులను తీవ్ర వేదనకు గురి చేస్తున్నారు. ఇలా జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడి మానసిక సంఘర్షణకు లోనయ్యవారు.. ఓ యువకుడిని ఆదర్శంగా తీసుకోవాలి. తన తల్లి పడుతున్న బాధను, కష్టాలను చూసి.. వాటిని తొలగించాలని ఆ యువకుడు భావించాడు. ఇటీవలే ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన అతడు.. భవిష్యత్తులో టీచర్ కావాలని ముందుగు సాగుతున్నాడు. అయితే అతడు ఎగ్జామ్ రాసింది.. అందరిలాగా చేతులతో కాదు.. కేవలం తన ఎడమ కాలితో ఈ సాహసం చేశాడు.
ఛత్తీస్‌గఢ్ లోని సుర్గుజా జిల్లాలోని అంబికా పూర్ ప్రాంతానికి చెందిన మహేశ్ సింగ్ అనే 17 ఏళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి ఫోకోమెలియా అనే అరుదైన వ్యాధితో కాళ్లు, చేతులు సరిగ్గా పనిచేయవు. అలా అంగవైకల్యంతో బాధపడుతున్న మహేష్ కు టీచర్ కావాలనే ఓ బలమైన కోరిక ఉండేది. అందుకే తన లక్ష్యానికి అంగవైకల్యం అడ్డంకి కాదని భావించాడు. అయితే మహేశ్ చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. మహేశ్ తల్లి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని సాకుతోంది. మహేష్ కు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. అతడి తల్లి వ్యవసాయ పనులు చేస్తూ వచ్చిన ఆదాయంతో కుమార్తెల పెళ్లి చేసింది.
అయితే తన తల్లి పడుతున్న బాధను మహేశ్ చూడలేకపోయాడు. ఎలాగైన బాగా చదివి ఉన్నత స్థితికి ఎదిగి.. తన తల్లిని సుఖంగా చూసుకోవాలని భావించాడు. అంగవైకల్యం కారణంగా తాను చేతులతో రాయలేకపోయేవాడు. అయితే తల్లి బాధలు గుర్తుకొచ్చి.. కష్టపడి చదువుతున్నాడు. పాఠశాలకు వెళ్లిన తొలి రోజు నుంచే మహేష్ కాలితో రాయడం మొదలు పెట్టాడు. ఇలా ఒక్కొక్క తరగతిని చదువుతూ ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నాడు. ఇటీవలే తన ఎడమ కాలితో బోర్డ్ ఎగ్జామ్స్ రాశాడు. ఈ పరీక్షల్లో 70 నుంచి 80 శాతం మార్కులు వస్తాయని మహేశ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
అలానే వీలైనంత త్వరగా హిందీ ఉపాధ్యాయుడిని కావాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తాను జాబ్ చేస్తూ 60 ఏళ్ల దాటిన తన అమ్మకు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నానని తెలిపాడు. తన కలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం కూడా తనకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు మహేశ్ తెలిపారు. మరి.. అన్ని అవయవాలు సరిగ్గా ఉండి.. చిన్న చిన్న అపజయాలకు నిరుత్సాహా పడుతూ ఉండే వారు మహేశ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చాలా మంది అభిప్రాయాపడుతున్నారు. మరీ.. చదువు కోసం, తల్లి కోసం ఎంతో ఆరాటపడుతున్న మహేశ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.