ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. అనధికారికంగానే కాకుండా మొబైల్ ఫోన్లలో కూడా బెట్టింగ్ ఆడుతుంటారు. ఇప్పుడు ఎన్నో యాప్స్ ఈ బెట్టింగ్ కోసం పుట్టుకొచ్చాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి.. బెట్టింగ్ ఆడుతున్నారు అంటే మీరు ఏడాదిపాటు జెలుకు వెళ్లేందుకు రెడీ అయిపోండి.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు దాదాపుగా ఆన్ లైన్ గేమ్స్ ఆడుతుంటారు. అయితే మీరు డబ్బుతో సంబంధం లేకుండా ఎలాంటి ఆన్ లైన్ గేమ్ ఆడినా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, మీ డేటా సెక్యూర్ గా ఉండే గేమ్స్ మాత్రమే ఆడుకోండి. కానీ, మీరు డబ్బు లావాదేవీలు చేస్తూ.. ఆన్ లైన్ లో బెట్టింగ్ లు పెడుతున్నారా? అయితే మీరు జైలుకు వెళ్లేందుకు రెడీ అయిపోండి. ఎందుకంటే ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ చేస్తున్న వారి డేటా సేకరించడం ప్రారంభించారు. ఎవరైతే ఇలా పోకర్, రమ్మీ వంటి గేమ్స్ ఆడుతున్నారో వారు ఇకపై వాటిని మానేయడం మంచిదని హెచ్చరిస్తున్నారు. లేదంటే కఠిన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధమైపోవాలని చెబుతున్నారు.
మీరు ఆన్ లైన్ రమ్మీ, పోకర్ వంటి గేమ్స్ ఆడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త ఇకపై అలాంటి ఆటలు ఆడితే జైలుకు వెళ్లక తప్పదు. ఇందుకు సంబంధించిన బిల్లును కూడా తమిళనాడు ప్రభుత్వం పాస్ చేసింది. చెన్నైలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆన్ లైన్ గ్యాబ్లింగ్ ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు. ఎవరైనా ఆన్ లైన్ గ్యాబ్లింగ్, మరే ఇతర డబ్బు సంబంధిత గేమ్స్ ఆడుతున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం యాంటీ ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ బిల్లును తీసుకొచ్చారు. నిబంధనలు ఉల్లఘించిన ఎవరైనా ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ఆడితే.. రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. లేదంటే ఏడాది పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆన్ లైన్ గేమ్స్ ప్రొవైడ్ చేసే వారిని గుర్తిస్తే.. వారికి రూ.10 లక్షల జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని స్పష్టం చేశారు.
కొన్నిసందర్భాల్లో జరిమానా, జైలు శిక్ష రెండూ పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్యాన్ చేశారు. ఇప్పుడు తమిళనాడులో కూడా ఈ నిషేధం అమలులోకి వచ్చింది. అయితే బ్యాన్ ఉన్నా లేకపోయినా.. మీరు ఆన్ లైన్ యాప్స్ లో బెట్టింగ్ పెట్టే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలాంటి జూదంలో పెట్టి నష్టపోకండి. ఎందుకంటే డబ్బు ఊరికే రాదనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. తమిళనాడులో ఉండే తెలుగు వాళ్లు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ ఆన్ లైన్ గ్యాబ్లింగ్ పై నిషేధం నిర్ణయం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.