గౌతమ్ అదానీ ఆస్తులు- అప్పులు- అక్రమాలు అంటూ ఇలా చాలా విషయాలపై.. విచారణ చేయాలంటూ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానీ- అదానీ ఫొటోని షేర్ చేస్తూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై జీబేపీ ఎదురుదాడి ప్రారంభించింది.
గౌతమ్ అదానీ.. అమెరికన్ షార్ట్ లిస్టెట్ కంపెనీ హిండెన్ బర్గ్ ఓ నివేదికను విడుదల చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు బాగా వార్తల్లో నిలిచింది. అదానీకి చెందిన లక్షలకోట్ల ఆస్తులు ఆవిరైపోయాయి. అదానీ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలేలా కూడా లేదు. ఎందుకంటే హిండెన్ బర్గ్ నివేదికపై సమగ్ర విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యంగా రాహుల్ గాంధీ పట్టుబట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అదానీ సక్సెస్ సీక్రెట్ ప్రధాని మోదీ అంటూ ఆరోపణలు కూడా చేశారు. అందుకు సంబంధించి అదానీ- ప్రధాని మోదీ కలిసి ఉన్న కొన్ని పాత ఫొటోలు కూడా షేర్ చేశారు. ఈ విమర్శలకు బీజీపీ ఇప్పుడు ఎదురుదాడి ప్రారంభించింది.
గౌతమ్ అదానీ ఆస్తులు, అప్పులు, బిజినెస్ లు ఇలా చాలా అంశాలపై కాంగ్రెస్ పలు ప్రశ్నలు సందిస్తున్న విషయం తెలిసిందే. అదానీపై వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ చేసి నిగ్గు తేల్చాలంటూ రాహుల్ గాంధీ ఎప్పటినుంచో ప్రశ్నిస్తున్నారు. అందుకు సాక్షాలు అన్నట్లుగా ప్రధాని మోదీ– అదానీ కలిసున్న కొన్ని ఫొటోగ్రాఫ్స్ ని కూడా పార్లమెంట్ లో ప్రదర్శించారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై బీజేపీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. గౌతమ్ అదానీతో రాబర్ట్ వాద్రా కలిసున్న కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెబుతారంటూ స్మృతి ఇరానీ ప్రశ్నిస్తున్నారు.
ఒక్క రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీని కాదు.. అన్ని ప్రతిపక్ష పార్టీలు సైతం అదానీ వ్యవహారంలో విచారణ జరగాల్సిందే అంటూ పట్టుపడుతున్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అదానీ ఆస్తులు కూడా భారీగా పెరిగాయంటూ ఆరోపణలు చేస్తనే ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై స్మృతి ఇరానీ స్పందించారు. ‘అదానీతో రాహుల్ అతనికి(గాంధీ) ఇబ్బంది ఉంటే.. మరి రాబర్ట్ వాద్రా ఎందుకు అదానీతో షేక్ హ్యాండ్స్ ఇస్తున్నాడు?’ అంటూ స్మృతి ఇరానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
If photographs were evidence of crony capitalism …….. pic.twitter.com/AzPZpSqv09
— Mahesh Jethmalani (@JethmalaniM) February 7, 2023