Vande Bharat Express: రైలు ప్రయాణాన్ని వేగవంతంగా, మరింత సౌకర్యవంతంగా చేయడడానికి భారత రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్‘. ఈ ప్రాజెక్టు 2023 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. మొత్తం ’45’ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే.. న్యూ ఢిల్లీ-వారణాసి, న్యూ ఢిల్లీ -మాతా వైష్ణో దేవి కాట్రా రూట్లలో రెండు వందే భారత్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. మూడోది.. ముంబై-అహ్మదాబాద్ మధ్య పరుగులు తీయనుంది.
భారత రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ రైళ్లను.. అత్యాధునిక హంగులతో ఆధునీకరించారు. పూర్తిగా ఇండియాలోనే వీటిని తయారీ చేస్తున్నారు. వీటిని సెమీ హై స్పీడ్ రైళ్లుగా పిలుస్తున్నారు. ఈ రైళ్లకు ప్రత్యేక ఇంజిన్ ఉండదు. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, ఏసీ చైర్ కార్ వంటివి ఉంటాయి. తక్కువ విద్యుత్తును వినియోగించుకునేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ రైళ్ళను స్టీల్‌తో కాకుండా తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో రూపొందిస్తున్నారు. మొదట దశలో తీసుకొచ్చిన రెండు రైళ్లకు మంచి ఆదరణ లభించడంతో వీటిని త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మూడోది ముంబై-అహ్మదాబాద్ మధ్య నడవనుంది. ఇప్పటికే.. ట్రయిల్ రన్ పూర్తి కావడంతో సెప్టెంబర్ 30న ప్రధాని చేతు మీదుగా దీన్ని ప్రారంభించనున్నారు.
Superior ride quality.
Look at the glass. Stable at 180 kmph speed.#VandeBharat-2 pic.twitter.com/uYdHhCrDpy— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022
కాగా, మొదటి వర్షన్ 54.6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగా.. తాజాగా రూపొందించిన రైలు 52 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందట. ఇకపోతే మొదటి వెర్షన్ రైలు గంటలకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగా.. ఈ రైలు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడవనుంది. అంతేకాదు.. వెర్షన్ రైతులో సీట్లను రీసైకిల్ చేసే సౌకర్యం లేదు. కానీ సెకండ్ వెర్షన్ రైతులో అన్ని కోచుల్లోని సీట్లను రీసైకిల్ చేయవచ్చట.
First Vande Bharat Train between Ahmedabad and Mumbai will be inaugurated by PM @narendramodi Ji on 30th September. The train will cover the distance in flat 5.30 Hours.
Blessings for Business Houses on this route. pic.twitter.com/g56OQutfPZ
— Dhaval Patel (@dhaval241086) September 15, 2022
వందే భారత్ ట్రైన్స్ ఫీచర్స్:
వందే భారత్ రైళ్లలో వై-ఫై ఫెసిలిటీతో 32 అంగుళాల ఎల్‌సీడీ టీవీ ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం క్యాటలిటిక్ యూవీ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్‌ను అమర్చారు. స్వచ్ఛమైన గాలి అందించడం కోసం సరికొత్త డిజైన్‌తో ట్రైన్ రూఫ్‌ను నిర్మించారు. ఇందులో వ్యాకుమ్ బేస్డ్ బయో టాయ్‌లెట్, ఆటోమేటెడ్ స్లైడింగ్ డోర్, విమానాల సీట్ల తరహాలో సీటింగ్ వ్యవస్థ, జీపీఎస్ ఆధారంగా నడిచే సమాచార వ్యవస్థ, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి.