పిల్లలకు పీఎం కేర్ అండగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వెల్లడించింది. ఈమేరకు తాజాగా వాటికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్‌ను మహిళల, పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రధాని మోదీ 29 మే, 2021 న కోవిడ్ 19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలకోసం కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. పిల్లల రక్షణ, ఆరోగ్య బీమా, చదువు లాంటి పలు విషయాలను పీఎం కేర్స్ చూస్తుందని తెలిపింది. అలాగే వారికి 23 సంవత్సరాలు నిండిన తరువాత ఆర్థిక సహాయం కూడా అందించనున్నారు.
అర్హులు వీరే..
29 మే 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వరకు ఈ పథకంలో నమోదు చేసుకున్న వారికే ఈ స్కీమ్ వర్తించనుంది. పీఎం కేర్స్ పథకం ప్రయోజనాలను గుర్తించిన ప్రతి లబ్ధిదారునికి 23 సంవత్సరాలు నిండే వరకు ఈ పథకం కొనసాగుతుంది.
అర్హతలు..
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన పిల్లలందరికీ ఇది వర్తిస్తుంది. అలాగే 11 మార్చి 2020 నుంచి WHO జారీ చేసిన 31 డిసెంబర్ 2021 వరకు కోవిడ్‌తో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు మాత్రమే వర్తించనుంది. అయితే తల్లిదండ్రులు మరణించిన తేదీ నాటికి పిల్లల వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండకూడదు.
ఇదీ చదవండి: కరోనాతో తల్లి లేదా తండ్రిని కోల్పోయిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్ షిప్.. ఇలా అప్లై చేయండి
Government issues guidelines for #PMCares for children scheme
The objective of the scheme is to ensure comprehensive care and protection of children who have lost their parent(s) to the #COVID19 pandemic
Read: https://t.co/E61KdUZ5O4 pic.twitter.com/xlVTjfk4l2
— PIB India (@PIB_India) October 7, 2021