మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నావీస్ ను అనిక్ష జైసింఘానీ అనే మహిళ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న అనిల్ జైసింఘానీను 72 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టి.. దాదాపు 720 కి.మీ దూరం వెంటాడి సినీఫక్కీలో అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ను అనిక్ష జైసింఘానీ అనే మహిళ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. తనకు రూ.10 కోట్లు ఇవ్వాలని.. లేదంటే అమృతకు చెందిన వీడియోలను వైరల్ చేస్తానని డిజైనర్ అనిక్ష జైసింఘానీ బెదిరింపులకు పాల్పడ్డట్లు అమృత పోలీసులకు తెలిపారు. దాంతో అనిక్ష జైసింఘానీ మీద బలవంతపు వసూళ్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న అనిల్ జైసింఘానీను పోలీసులు అరెస్ట్ చేశారు. 72 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టి.. దాదాపు 720 కి.మీ దూరం వెంటాడి సినీఫక్కీలో అతడిని అరెస్ట్ చేశారు. అయితే అసలు ఎవరూ ఈ అనిల్.. ఆయన కోసం పోలీసులు ఎందుకంతలా శ్రమించారు?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అనిక్ష జైసింఘానీ ఏడాదిన్నరగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌కు డిజైనర్‌గా వ్యవహరిస్తుంది. అయితే అనిక్ష తండ్రి అనిల్ జైసింఘానీ.. పేరు మోసిన అంతర్జాతీయ క్రికెట్ బుకీ. ఐపీఎల్ సమయంలో కోట్ల రూపాయలతో అతడు బెట్టింగ్ నిర్వహిస్తుంటాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం వారికి భారీగా లంచాలు ఇస్తాడు. అలా పోలీసులకు లంచాలు, ఇతర ఖరీదైన వస్తువులు ఇచ్చే సమయంలో వీడియో తీసి.. పోలీసులనే బెదిరిస్తుండే వాడు. బెట్టింగ్ విషయంలో అనిల్‌కు రాజకీయ అండదండలున్నాయి. ఇప్పటి వరకు అతడిపై 15 కేసులు నమోదయ్యాయి.
అనిక్ష.. తన తండ్రి అనిల్ ను కేసుల నుంచి బయపడేయమని కోరింది. అందుకు మొదట రూ.కోటి ఇస్తానని తెలిపింది. అయితే అందుకు అమృతా ఫడ్నవీస్ నిరాకరించారు. దీంతో కొన్ని మార్ఫింగ్ వీడియోలను తయారు చేసి వాటిని లీక్ చేస్తానని అమృతపై బెదిరింపులకు పాల్పడింది. దీంతో తండ్రీకూతుర్లపై అమృతా ఫడ్నవీస్ బ్లాక్ మెయిల్ బెదిరింపుల కేసు పెట్టిన పెట్టారు. దీంతో ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ గుజరాత్ వెళ్లి మరీ అనిల్ ను అరెస్ట్ చేసింది. అనిల్ చాలా ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించి అతడిని అరెస్ట్ చేసి..ముంబైకి తీసుకెళ్లారు.
ఇంతకాలం అనిల్ సాంకేతిక సాయంతో పోలీసుల నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. అతడిని పట్టుకునేందుకు ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు చివరకు అదుపులోకి తీసుకున్నారు. అతడు బర్దొలీలో ఉండగా పట్టుకునేందుకు పోలీసులు ప్లాన్ సిద్ధం చేశారు. అయితే అతడు అక్కడి నుంచి తప్పించుకుని సూరత్, వడోదర, బరుచ్ కి వెళ్లాడు. అక్కడి నుంచి గోద్రాకు పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకున్నారు. ఏక ధాటిగా 72 గంటల పాటు 750 కి.మీ దూరం వెంటబడి అతడిని అరెస్ట్ చేశారు. మరి.. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఛేజింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.