అసెంబ్లీ అనేది దేవాలయం లాంటి. అక్కడ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలకపై చర్చలు జరుపుతుంటారు. అధికార, విపక్షాలు ప్రజల సమస్యలపై మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు గడిపే ప్రతి క్షణం ఎంతో విలువైనది. తమ ప్రాంత సమస్యలపై ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలియజేయడానిక అసెంబ్లీ అనేది చాలా ముఖ్యవేదిక. అయితే కొందరు ప్రజాప్రతినిధులు తమ హోదాను మరిచి.. తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.. చట్టసభలో కూర్చొని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు పాడు పనులు చేస్తున్నారు. ఇంతకి ఆ ఎమ్మెల్యేలు చేసిన ఆ పని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార, విపక్షాల పార్టీల ఎమ్మెల్యేలు,మంత్రులు ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. రాష్టంలో జరుగుతున్న కొన్ని ఘటనలపై ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అయితే ఇదే సమయంలో ఝాన్సీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పొగాకు నములుతూ, మరో ఎమ్మెల్యే వీడియో గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. వీరిద్దరు వారి వారి పనులులో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సమాజ్ వాది పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సదరు ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తోన్నాయి. ఛీ..ఛీ.. అసెంబ్లీలో ఇదేం పని? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. వీరికి ప్రజా సమస్యల కంటే ఇలాంటి పనికిమాలిన పనులు బాగా ఇష్టంలా ఉందని, ఇలాంటి వారు మన ప్రజాప్రతినిధులుగా కావడం దురదృష్టం అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరి.. ఈవీడియోలపై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
सदन की गरिमा को तार-तार कर रहे भाजपा विधायक!
झांसी से भाजपा विधायक तंबाकू खा रहे।
इन लोगों के पास जनता के मुद्दों के जवाब हैं नहीं और सदन को मनोरंजन का अड्डा बना रहे।
बेहद निंदनीय एवं शर्मनाक !@yadavakhilesh @samajwadiparty @yadavtejashwi @LambaAlka @MPDharmendraYdv pic.twitter.com/Dsh4O6MmAw
— Pankaj Kumar🇮🇳 (@iPankajkrRJD) September 24, 2022
सदन की गरिमा को तार-तार कर रहे भाजपा विधायक!
महोबा से भाजपा विधायक सदन में मोबाइल गेम खेल रहे।
इन लोगों के पास जनता के मुद्दों के जवाब हैं नहीं और सदन को मनोरंजन का अड्डा बना रहे।
बेहद निंदनीय एवं शर्मनाक ! @yadavakhilesh @samajwadiparty @MPDharmendraYdv @LambaAlka @Nawalk7 pic.twitter.com/ENwZRnFwZu
— Pankaj Kumar🇮🇳 (@iPankajkrRJD) September 24, 2022