మగవాళ్లు.. ఆడవాళ్లుగా రెడీ అయి అమ్మవారికి పూజలు చేయడం అక్కడి ఆచారం. అలా చేస్తే మంచి జరుగుతుందని వారి నమ్మకం. ఆ ఆచారం, సాంప్రదాయం పక్కనపెడితే.. అసలు ముదురు మగవాళ్లు అంత అందంగా ఎలా కనిపిస్తున్నారు? స్త్రీలుగా రెడీ అయినా తర్వాత వారిలో కొత్త కళ ఎలా వస్తోంది? ఆడవాళ్లు సైతం కుళ్లుకునేంత అందంగా ఎలా కనిపిస్తున్నారు? అసలు దీని వెనుక రహస్యమేంటో తెలుసుకుందాం..
మగవాళ్లు.. ఆడవాళ్లలా ముస్తాబై అమ్మవారికి పూజలు చేస్తున్నారనే విషయం వైరల్‌గా మారింది. పూజల విషయం పక్కన పెడితే.. వాళ్ల అందానికి అంతా ఫిదా అవుతున్నారు. ఏంటీ వీళ్లంతా మగవాళ్లా అంటూ అసలు విషయం తెలిసి షాక్ కూడా అవుతున్నారు. ఆడవాళ్ల వేషాదారణలో వాళ్లు నిజంగానే చాలా అందంగా ఉన్నారు. వాళ్లను చూస్తుంటే ఆడవాళ్లలా తయారైన మగాళ్లు అని ఎవరూ అనుకోరు. అందంగా ముస్తాబైన అమ్మాయిలే అనుకుంటారు. ఆ చీర కట్టు, వాలు జడలు, వారి సోయగాలు చూస్తుంటే.. ఇది కదా అందం అంటూ చాలా మంది సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు.
ఇక ఇదంతా.. కేరళలోని కోళ్లాం జిల్లా, కొట్టంకులంగరలో గల నవదుర్గ ఆలయంలో పూజలో పాల్గొన్న వారి గురించి. మగవాళ్లు.. ఆడవాళ్లుగా రెడీ అయి అమ్మవారికి పూజలు చేయడం అక్కడి ఆచారం. అలా చేస్తే మంచి జరుగుతుందని వారి నమ్మకం. ఆ ఆచారం, సాంప్రదాయం పక్కనపెడితే.. అసలు ముదురు మగవాళ్లు అంత అందంగా ఎలా కనిపిస్తున్నారు? స్త్రీలుగా రెడీ అయినా తర్వాత వారిలో కొత్త కళ ఎలా వస్తోంది? ఆడవాళ్లు సైతం కుళ్లుకునేంత అందంగా ఎలా కనిపిస్తున్నారు? అసలు దీని వెనుక రహస్యమేంటో తెలుసుకుందాం..
అందం అమ్మాయిల సొంతం. అందులో ఎలాంటి సందేహం లేదు. దేవుడిచ్చిన అందాన్ని మరింత పెంచుకోవడానికి వాళ్లు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఏదైన ఫంక్షన్ కోసం రెడీ అవ్వాలంటే గంట కొద్ది సమయం కావాలి. టైమ్ ఎక్కువగా తీసుకున్నా.. రెడీ అయితే చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. మన దిష్టే తగులుతుందేమో అనిపిస్తుంది. అలాంటి అందం ఆడవాళ్ల సొంతం. అయితే, మగవాళ్లు.. ఆడవాళ్లలా రెడీ అయితే.. అప్పటి వరకు వారితో తిరిగిన మగాళ్లు సైతం.. ‘హేయ్.. ఎవర్రా ఈ అమ్మాయి’ అంటూ సొల్లు కార్చడం ఖాయం. దానికి ప్రత్యక్ష ఉదాహరణే కేరళలో పూజలో పాల్గొన్న మగామ్మాయిలు. అయితే.. వీళ్లు అంత అందంగా ముస్తాబు అవ్వడం వెనుక ఉన్నదంతా మేకప్ మహిమా.
అమ్మాయిల్లా కనిపించాలంటే ముఖ్యంగా గడ్డం, మీసాలు ఉండొద్దు. వాటిని నీట్‌గా సేవ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఐబ్రోస్ షేప్ చేయించుకుంటారు. అమ్మాయి అందాన్ని రెట్టింపు చేసేవి కళ్లు. అందుకే.. ఆడవాళ్లలా మారే ఈ అబ్బాయిలు కళ్లపై బాగా దృష్టిపెడతారు. ఆ తర్వాత పేస్‌పై పలు రకాల క్రీమ్‌లు అప్లై చేసి.. అందంగా రెడీ అవుతారు. ఫైనల్ జుట్టు, చీర కట్టు. నిజమైన జట్టును మించే విగ్గు, అందులో మూడు మూరల మల్లపూలు పెట్టుకుంటారు. కుచ్చుళ్లు బాగా పేర్చి చీరను చాలా సొగసుగా కట్టుకుంటారు. మ్యాచింగ్ గాజుల, ఆభరణాలు ధరించి.. అందంగా ముస్తాబై.. మగాళ్లే మగాళ్ల మనసులు కొల్లగొట్టేస్తారు.
అయితే.. ఇందంతా ఆధ్యాత్మక కార్యక్రమంలో భాగంగానే జరుగుతుంది. ఈ పండుగ సమయంలో ఆలయం బయట స్పెషలిస్ట్ మేకప్ ఆర్టిస్టులు, బ్యూటీషియన్లు ప్రత్యేకంగా షాపులు పెట్టుకుని ఉంటారు. పూజలో పాల్గొనేందుకు వీరి వద్దకు వెళ్లి భారీగా డబ్బు చెల్లించి.. అమ్మాయిలను మించిన అందాన్ని తమ సొంతం చేసుకుంటారు కొంతమంది మగాళ్లు. అయితే.. మేకప్‌లో వాడే పలు రకాల క్రీములు ఏంటో, అవి ఎలా వాడాలో మాత్రం బ్యూటీషియన్లు మంచి అవగాహన ఉంటుంది. అందంగా ఉన్న వారిని మరింత అందంగా తయారు చేయడం ఒక కళ.. మగాళ్లను సైతం అప్సరసల్లా రెడీ చేయడం అంతకు మించిన కళ. ఆ కళను అవసోపన పట్టి.. మగాళ్లను సైతం అందమైన అమ్మాయిల్లా మారుస్తున్న మేకప్ ఆర్టికస్టు కష్టంతోనే వాళ్లు అంత అందంగా కనిపిస్తున్నారు. వారి అందం రహస్యం వెనుక మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.