కొంతకాలం క్రితం కర్నాటక రాష్ట్రంలో ఇద్దరు సివిల్ సర్వీస్ అధికారుల మధ్య జరిగిన వివాదం తెలిసిందే. ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూప మౌద్గిల్ అధికారిణుల మధ్య వివాదం చోటుచేసుకుంది. రూప మౌద్గిల్.. రోహిణి సింధూరికి సంబధించిన వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం, అందుకు ప్రతిగా సింధూరి అదే స్థాయిలో ప్రతిస్పందిచడం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయంలో ఐపీఎస్ అధికారిణి రూపకు ఊరట లభించింది.
కొంతకాలం క్రితం కర్నాటక రాష్ట్రంలో ఇద్దరు సివిల్ సర్వీస్ అధికారుల మధ్య జరిగిన వివాదం తెలిసిందే. ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూప మౌద్గిల్ అధికారిణుల మధ్య వివాదం చోటుచేసుకుంది. రూప మౌద్గిల్.. రోహిణి సింధూరికి సంబధించిన వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం, అందుకు ప్రతిగా సింధూరి అదే స్థాయిలో ప్రతిస్పందిచడం అందరికీ తెలిసిందే. ఇలా పబ్లిక్ గా ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అలానే ఈ వివాదం చివరకు కోర్టు వరకు వెళ్లింది. తాజాగా వీరి వివాదంలో ఐపీఎస్ అధికారిని రూపకు హైకోర్టులో ఊరట లభించింది.
కొన్నినెలల క్రితం కర్నాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళా ప్రభుత్వ అధికారుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరు ఐఏఎస్ అధికారి రోహిణి కాగా మరొకరు ఐపీఎస్ రూప. ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడిచింది. చివరకు ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలో స్థానిక కోర్టు ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిపై ఐపీఎస్ అధికారి రూప పరువు నష్టం కలిగించే ప్రకటనలను చేయరాదని ఆంక్షలు విధించింది. తనపై విధించిన ఆంక్షలపై ఐపీఎస్ అధికారిణి రూప హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో పరువు నష్టం కలిగించే ప్రకటనలను చేయరాదని కింది కోర్టు విధించిన ఆంక్షలను హైకోర్టు రద్దు చేసింది.
తన వాదనలను వినకుండా ఆంక్షలను విధించారని రూప దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస హరీశ్‌కుమార్ ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. కింది కోర్టు స్టే విధించిన తరువాత రోహిణి సింధూరి ఆ కోర్టులో సమర్పించిన పత్రాలను రూపకు అందించాలి. కానీ ఆమె స్పీడ్ ద్వారా పోస్టులో పంపినామని, స్టేని కొనసాగించాలని రోహిణి కోరారు. నోటీసులు పంపకుండా ఆంక్షలను అమలు చేస్తే అవి దానంతట అవే రద్దవుతాయని రూప తరఫున న్యాయవాది తెలిపారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఐపీఎస్ రూపకు అనుకూలం అయ్యింది. మరి.. హైకోర్టు ఇచ్చిన అదేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.