కొంతకాలం క్రితం కర్నాటక రాష్ట్రంలో ఇద్దరు సివిల్ సర్వీస్ అధికారుల మధ్య జరిగిన వివాదం తెలిసిందే. ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూప మౌద్గిల్ అధికారిణుల మధ్య వివాదం చోటుచేసుకుంది. రూప మౌద్గిల్.. రోహిణి సింధూరికి సంబధించిన వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం, అందుకు ప్రతిగా సింధూరి అదే స్థాయిలో ప్రతిస్పందిచడం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయంలో ఐపీఎస్ అధికారిణి రూపకు ఊరట లభించింది.
ఐఏఎస్, ఐపీఎస్ మహిళా అధికారిణుల వివాదాన్ని కర్ణాటక సీరియస్ గా తీసుకుంది. మొదట చూసిచూడనట్లు వదిలేసిన ప్రభుత్వ అధికారులు, వ్యక్తి గత ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవరకు దారితీయడంతో చర్యలు చేపట్టారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి బహిరంగ విమర్శలకు దిగినందుకుగానూ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.