దేశంలోనే రెండవ అతిపెద్ద ఆభరణాల సంస్థ అయిన జోయ్ అలుక్కాస్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రూ. 300 కోట్ల నిధులను విదేశాలకు మళ్లించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
దేశంలోని ప్రముఖ ఆభరణాల సంస్థ జోయ్ అలుక్కాస్ జ్యూయలరీస్ లో ఈడీ సోదాలు జరిగాయి. బుధవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 25 ఎకరాల్లో నిర్మించబోయే ప్రాజెక్టు కోసం విదేశాలకు హవాలా రూపంలో రూ. 300 కోట్ల నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జోయ్ వర్గీస్ అలుక్కాస్ ఇంట్లో, అలానే కార్పొరేట్ ఆఫీసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 300 కోట్ల నిధులు విదేశాలకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సెబీలో రూ. 2 వేల కోట్ల ఐపీఓకి దరఖాస్తు చేసుకున్న జోయ్ అలుక్కాస్ ఉన్నట్టుండి ఐపీఓను ఉపసంహరించుకుంది.
ఐపీవో ఉపసంహరించుకున్న మరునాడే ఈడీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. జోయ్ అలుక్కాస్ సంస్థతో పాటు ఆ సంస్థ అధినేత నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 68 శాఖలు ఉన్నాయి. జ్యూయలరీ బిజినెస్ లో దేశంలోనే రెండవ స్థానంలో ఉంది జోయ్ అలుక్కాస్. గత ఏడాది ఐపీవోకి వెళ్తున్నట్లు ప్రకటించిన జోయ్ అలుక్కాస్.. ఈ ఐపీవో ద్వారా రూ. 2,300 కోట్లను సమీకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జోయ్ అలుక్కాస్ ఐపీవో వద్దంటూ ఉపసంహరించుకుంది.
జోయ్ అలుక్కాస్ సంస్థ సెబీకి కూడా సమాచారం అందించింది. అయితే ఐపీవోని ఉపసంహరించుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉండగా.. ఐపీవోకి వెళ్లడం ద్వారా వచ్చే 1400 కోట్లను అప్పులు రీపే చేయడం లేదా ప్రీపే కోసం కొత్త షోరూంలు ప్రారంభానికి ఖర్చుపెట్టాలన్న ప్రణాళికలో సంస్థ ఉన్నట్లు ప్రచారం జరిగినా ఆఖరున వెనక్కి తగ్గింది. 2018లో కూడా ఇలానే జోయ్ అలుక్కాస్ సంస్థ.. ఐపీవో ప్రకటన చేసి ఆ తర్వాత రద్దు చేసుకుంది. జోయ్ అలుక్కాస్ సంస్థ ఐపీవోని విరమించుకున్న మరుసటి రోజే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.