గత నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నంతగా వానలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసిన నీరు.. కన్నీరు తప్ప ఇంకేం కనిపించడం లేదు. వర్షాకాలం ప్రాంరభంలోనే ఇంత భారీ వర్షాలు చాలా అరుదు అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా వరదలు పోటెత్తుతున్నాయి. రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోయి.. సర్వం కోల్పోయి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
ఈ క్రమంలో మహారాష్ట్రలో ఓ హృదయవిదారక సంఘటన వెలుగు చూసింది. కారులో వెళ్తున్న కుటుంబం వరదనీటికి బలైంది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆఖరినిమిషం వరకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాపాడండని కేకలు వేస్తూ హాహాకారాలు చేసినా.. లాభం లేకపోయింది. కళ్ల ముందే అంతమంది ప్రాణాలు కోల్పోతుంటే.. వరదకు భయపడి జనాలు చూస్తూ ఉండటం తప్ప కాపాడలేని నిస్సహాయ పరిస్థితి. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Video: అందరూ చూస్తుండగానే.. వరదలో కొట్టుకుపోయిన పోలీస్ స్టేషన్..! వీడియో వైరల్
మహారాష్ట్ర నాగ్‌పూర్ సావ్నెర్ మండలం కేల్వాద్ దగ్గర నందా నదిలో ఈ విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ముల్తాయికి చెందిన ఓ కుటుంబం.. వివాహ వేడుక కోసం నాగ్‌పూర్‌కు వచ్చింది. తిరిగి ఊరికి వెళ్తున్న క్రమంలో వాళ్ల వాహనం బ్రిడ్జిపై వెళ్తుండగా.. హఠాత్తుగా వరద ముంచెత్తి ఇలా నదిలో చిక్కుకుని కొట్టుకుపోయింది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం వారు చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి. కాపాడండని కేకలు వేసినా.. చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నా.. వరద ఉధృతిని చూసి ముందుకు వచ్చి సాహసం చేసి రక్షించలేని పరిస్థితి. వెరసి.. వాహనంతో పాటే కొట్టుకుని పోయి ప్రాణాలు వదిలారు.
అంతా చూస్తుండగానే.. వాహనం మునిగి కొట్టుకుపోగా.. నిస్సహాయంగా చూస్తూ రక్షించే ప్రయత్నాలు చేయలేకపోయారు గ్రామస్తులు. ఉన్నతాధికారులకు సమాచారం అందించినా.. వాళ్లు వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. కొందరు మొబైల్స్‌లో వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ముగ్గురు మృతి చెందగా.. అందులో ఒక మహిళ కూడా ఉంది. మరో ముగ్గురు వాహనంతో పాటు గల్లంతయ్యారు. వాళ్ల కోసం గాలింపు చర్యలు పెట్టారు అధికారులు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో వర్ష ప్రభావంతో ఇప్పటిదాకా(జూన్ 1 నుంచి జులై 10 దాకా) 83 మంది మృతి చెందారని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#BREAKING #News #Monsoon2022 #Maharashtra 3 died and about 3 trapped after a scorpio car washed away in Nanda river of Kelwad, Tahsil Saoner, District #Nagpur amid heavy flow of water induced by rains, confirms @SPNagpurrural@CMOMaharashtra@Dev_Fadnavis@Deve #MaharashtraRains pic.twitter.com/gJ0HQIzOrz
— Ketan Sojitra (@Public_Affairs7) July 12, 2022
ఇది కూడా చదవండి: Viral Video: రోడ్లపై తిరిగే బిచ్చగాడు.. కట్ చేస్తే.. బాలీవుడ్ హీరోలకు పోటీగా!