ఇటీవల కూలి పనులు చేసుకునే సాకే భారతి పీహెచ్డీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో యావత్తు దేశం ఆమె వైపు తిరిగి చూసింది. ఇదే తరహాలో మరొక యువకుడు సివిల్స్ ఎగ్జామ్స్ ని క్లియర్ చేసి టాక్ ఆఫ్ ద నేషన్ గా నిలిచారు.
సక్సెస్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది కసిగా ప్రయత్నించే అందరిదీను. సంకల్పం ఉండాలే గానీ ఏదైనా సాధించవచ్చు. చాలా మంది తమ దగ్గర ఏమీ లేకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా గానీ సంకల్పం అనే ఆయుధంతో అనుకున్నది సాధిస్తారు. ఇటీవలే కూలి పనులు చేసుకుని జీవించే భారతి.. పీహెచ్డీ పూర్తి చేసి టాక్ ఆఫ్ ద నేషన్ గా నిలిచారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని ఆమె మరోసారి రుజువు చేశారు. తాజాగా ఈమె బాటలోనే మరొక వ్యక్తి చేరిపోయారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. ఇందులో పెద్ద వింతేముంది అని అనుకోకండి. ఎందుకంటే అతను జొమాటోలో డెలివరీ బాయ్ గా చేస్తారు.
ఫుడ్ ఆర్డర్స్ తీసుకుని ఇంటింటికీ డెలివరీ చేసే డెలివరీ బాయ్ అతను. డెలివరీ బాయ్ గా చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే క్లియర్ చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన విగ్నేష్ అనే అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారు. డెలివరీ బాయ్ గా పని చేస్తూనే తమిళనాడు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. జూలై 12న పరీక్ష ఫలితాలు రాగా.. జూలై 24న జొమాటో కథనాన్ని షేర్ చేసింది. దాంతో పాటు విగ్నేష్ తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ విగ్నేష్ ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటి వరకూ ఫుడ్ ఆర్డర్స్ తీసుకున్నావు, ఇక నుంచి ఆర్డర్స్ వేస్తావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే మరి.. ఫుడ్ ఆర్డర్స్ తీసుకునే స్థాయి నుంచి ఆర్డర్స్ వేసే స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. మామూలుగా ఒక పని చేయడమే ఈరోజుల్లు కష్టం. ఈ మాయదారి ట్రాఫిక్ లో ఆఫీస్ కి వెళ్లొచ్చి మళ్ళీ ఇంకో పని చేయడమే కష్టం. అలాంటిది రోజంతా ట్రాఫిక్ లో పరుగులు పెడుతూ కూడా ఏ మాత్రం చిరాకు పడకుండా సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం.. తొలి అటెంప్ట్ లోనే పాసవ్వడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. మరి డెలివరీ బాయ్ గా చేస్తూ సివిల్స్ లో ఉత్తీర్ణులైన విగ్నేష్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
drop a like for Vignesh, who just cleared Tamil Nadu Public Service Commission Exam while working as a Zomato delivery partner ❤️ pic.twitter.com/G9jYTokgR5
— zomato (@zomato) July 24, 2023