మండే ఎండలే కాదు.. విద్యుత్ కోతలు కూడా దేశ ప్రజలను తీవ్ర ఇంబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒక్క ఏపీలోనే కాదు.. మొత్తం దేశవ్యాప్తంగా ధర్మల్ విద్యుత్ పై ఆధారపడిన ఎన్నో రాష్ట్రాలు ఇప్పుడు కరెంట్ కోతలు విధించక తప్పడం లేదు. ఒకవైపు మండే వేసవి.. మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర అసహనం, ఇబ్బందికి గురవుతున్నారు. చాలా మంది ఈ విద్యుత్ కోతలపై నోరు మెదపక పోయినా.. కొందరు మాత్రం బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.. ప్రభుత్వాల తీరును తప్పబడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షి చేరింది. ఒక టాక్స్ పేయర్‌గా విద్యుత్ కోతలపై జార్ఖండ్ ప్రభుత్వాన్ని నిలదీసింది.
జార్ఖండ్ లో పరిస్థితి దారుణంగా మారుతోంది. ప్రభుత్వ విద్యుత్ కోతలను తీవ్రతరం చేస్తోంది. ప్రజలు ఎండవేడిమికి తట్టుకోలేక పోతున్నారు. మరోవైపు ఈ ఎండలకు బయట పనులకు సైతం వెళ్లే పరిస్థితి లేదు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ధోనీ భార్య సాక్షి జార్ఖండ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘జార్ఖండ్ ప్రభుత్వానికి పన్ను కట్టే వ్యక్తిగా నేను ఒక విషయం తెలుసుకోవాలని భావిస్తున్నాను. ఎందుకని ఎన్నో సంవత్సరాలుగా జార్ఖండ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం కొనసాగుతోంది. మా వంతుగా విద్యుత్ ను ఆదా చేసేందుకు మేం చేయాల్సిందల్లా చేస్తున్నాం. కానీ, ఈ విద్యుత్ కోతలు ఎందుకు ఆగడం లేదు’ అంటూ సాక్షి ప్రశ్నించింది.
ఒక టాక్స్ పేయర్ గా తెలుసుకోవడం తన హక్కు అనే విధంగా ఆమె ప్రశ్నించిన తీరును ట్విట్టర్ లో మెచ్చుకుంటున్నారు. కొందరైతే రాజధాని నగరంలో నివసించే మీరే విద్యుత్ కోతలకు ఇంతలా ఇబ్బంది పడుతున్నారు అంటే.. మిగతా ప్రాంతాల్లో వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఎన్నిసార్లు ఎంతగా ప్రశ్నించినా కూడా ఎవరూ స్పందించరు. వారికి ఆ అవసరం లేదని భావిస్తుంటారని ఇంకొదరు అభిప్రాయపడ్డారు. చాలా మంది కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికీ బొగ్గు ఆధారిత విద్యుత్ పై ఆధారపడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. గ్రీన్ ఎనర్జీని, ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలుకుతున్నారు. అనేక రాష్ట్రాల్లో ఇంతగా విద్యుత్ సంక్షోభం నెలకొనడానికి కారణాలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
As a tax payer of Jharkhand just want to know why is there a power crisis in Jharkhand since so many years ? We are doing our part by consciously making sure we save energy !
— Sakshi Singh 🇮🇳❤️ (@SaakshiSRawat) April 25, 2022
ma’am, that too when you’re living in capital (ranchi), just think what would be the situation of other cities. This became fate of all Jharkhand’s people. @HemantSorenJMM @JharkhandCMO govt. is worst than all previous govt can’t even provide electricity.https://t.co/izF0YTcrfY
— Alok Prasoon (@Alok_Prasoon) April 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.