వయసు 21 ఏళ్ళు. చదివింది బీటెక్. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తే జీతం లక్షల్లో వస్తుంది. కానీ తన ఆనందాన్ని నాలుగు గోడల మధ్య కాకుండా నాలుగు గోడల బయట చూసుకుంది. నాలుగు గోడల బయట అయితేనే తనకు ఆనందం దక్కుతుందని భావించి పానీపూరీ వ్యాపారం ప్రారంభించింది. అంత చిన్న వయసులో నెలకు 8 లక్షల నుంచి 9 లక్షలు సంపాదిస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఈమె ముందు దిగదుడుపే అనేలా ఆమె సంపాదన ఉంది. మరో విశేషం ఏంటంటే ఆమె బుల్లెట్ బండి మీద తిరుగుతూ పానీపూరీ అమ్ముతుంది.
22 ఏళ్ల వ్యక్తి ‘ఎంబీఏ ఛాయ్ వాలా’ పేరుతో ఒక టీ బిజినెస్ ని ప్రారంభించి కోట్లలో సంపాదిస్తున్నాడు. 20 ఏళ్ల వయసులో ఐఐఎంలో ఎంబీఏ చదువుకు అడ్మిషన్ దొరకలేదని టీ స్టాల్ పెట్టుకోవాలని అనుకున్నాడు. అలా ఎంబీఏ ఛాయ్ వాలా పేరుతో టీ స్టాల్ పెట్టి ఇవాళ కోట్ల టర్నోవర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో డిగ్రీని తన వ్యాపారానికి టైటిల్ గా పెట్టి ఓ యువతి చరిత్ర సృష్టించింది. 21 ఏళ్ల యువతి బీటెక్ పానీపూరీ పేరుతో ఒక స్టాల్ ని నడుపుతోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆమె బుల్లెట్ బైక్ మీద పానీపూరీ బండిని గిరా గిరా తిప్పుతూ అమ్ముకుంటూ రోజుకు వేలల్లో సంపాదిస్తోంది. అంతేకాదు ఆకలితో ఉన్న వారికి పానీపూరీ ఇచ్చి వారి కడుపు నింపుతుంది. ఆమె పేరు తాప్సీ ఉపాధ్యాయ్.
బీటెక్ అయిపోయిన తర్వాత ఈ పానీపూరీ వ్యాపారాన్ని ప్రారంభించింది. జనానికి ఆరోగ్యకరమైన పానీపూరీ అందించడమే తన లక్ష్యమని ఆమె వెల్లడించింది. ‘ఆమె బీటెక్ చదివి, తన కాళ్ళ మీద తను నిలబడింది. గ్రేట్’ అంటూ కస్టమర్లు ఆమెను కొనియాడుతున్నారు. ఆమె వడ్డించే పానీపూరీ రుచికరంగా ఉండడమే గాక చాలా శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటాయని కస్టమర్లు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ప్లేట్ వచ్చి రూ. 30 లకు అమ్ముతున్నామని, ప్లేట్ కి 6 పానీపూరీలు వస్తాయని ఆమె వెల్లడించింది. సగటున రోజుకు 300 నుంచి 400 ప్లేట్లు అమ్ముతామని, రోజుకు రూ. 9 వేల నుంచి రూ. 12 వేలు అమ్ముతామని వెల్లడించింది. తనకు ఇలాంటి పానీపూరీ బండ్లు 4 ఉన్నాయని.. నాలుగు బండ్ల మీద యావరేజ్ గా రోజుకు రూ. 30 వేలు సంపాదిస్తున్నానని.. నెలకు 8 లక్షల నుంచి 9 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పుకొచ్చింది.
న్యూ ఢిల్లీలోని తిలక్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఆమె తన పానీపూరీ స్టాల్ నడుపుతుండగా.. మరో 4 బండ్లు ఢిల్లీలోని వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. త్వరలో ఆమె దేశమంతా తన పానీపూరీ వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. బీటెక్ చదివి ఉద్యోగం చేస్తే ఆమెకు ఎంత జీతం వచ్చేదో తెలియదు గానీ పానీపూరీ బిజినెస్ చేస్తూ తన కింద కొంతమందికి ఉద్యోగం అయితే ఇచ్చింది. ఇంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఇంకేముంటుంది చెప్పండి. తన నాన్నకు చరిత్ర సృష్టించబోతున్నాను అని సవాల్ చేసి మరీ నిజం చేసిన ఈ యువతికి ఒక లైక్ వేసుకోండి. అలానే కామెంట్ సెక్షన్ లో హ్యాట్సాఫ్ చెప్పండి. ఈమె కథను షేర్ చేసి యువతీ, యువకుల్లో స్ఫూర్తిని రగిలించండి.