ప్రేమలో పడిన వారికి లోకంతో పని ఉండదు. 24 గంటలు ప్రేమించిన వారి ఊసులు, ఊహలతోనే కాలం గడిపేస్తారు. ప్రేమ మైకంలో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారు. ఇక ప్రేమించిన వారు కాసేపు కనపడకపోతే.. విలవిల్లాడతారు.. వారి ఊసులు మనసులోకి వచ్చిందే ఆలస్యం.. వెంటనే వెళ్లి.. చూడాలని భావిస్తారు. ప్రేమించిన వారిని కలవడం కోసం ఎంత సాహసమైనా చేస్తారు. అయితే మూడో మనిషి కంటపడనంత వరకే ఈ సాహసాలు.. థ్రిల్, కిక్కు ఇస్తాయి. ఒకవేళ ఖర్మకాలి దొరికిపోయామే.. అప్పుడు ఉంటుంది చూడు.. పారిపోయేందుకు ఏదో ఒక మార్గం దొరికితే చాలురా దేవుడా అని వేడుకుంటారు. ముందు వెనకా చూడకుండా పారిపోయే ప్రయత్నం చేసి.. లేనిపోనిచిక్కుల్లో పడతారు.
తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. అర్థరాత్రి ప్రియురాలిని చూడటం కోసం.. ఆమె ఇంటికి వెళ్లాడు ప్రియుడు. అయితే దురదృష్టం కొద్ది.. ప్రియురాలి తల్లిదండ్రులు అతడిని చూడటంతో.. భయంతో పరిగెత్తి.. బావిలో దూకాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఇది చదవండి.
ఈ సంఘటన బిహార్‌లో వెలుగు చూసింది. ఛాప్రా జిల్లా.. గడ్కా పోలీస్ సేటషన్‌పరిధిలోని మోతీరాజ్ పూరలో ఉండే మున్నా రాజ్ అనే వ్యక్తి.. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో శనివారం అర్థరాత్రి.. ప్రియురాలిని చూడటం కోసం దొంగతనంగా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అయితే అర్థరాత్రి వేళ ఇంట్లో శబ్దాలు రావడంతో.. యువతి కుటుంబ సభ్యులు లేచారు. ఆ సమయంలో వారికి ఇంట్లోకి ప్రవేశిస్తున్న మున్నా రాజ్ కనిపించాడు. దాంతో.. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు యువతి కుటుంబ సభ్యులు.
ఇక వారి నుంచి తప్పించుకోవడం కోసం మున్నారాజ్.. పరిగెత్తుకుంటూ వెళ్లి దగ్గర్లోని బావిలో దూకాడు. అతడిని బయటకు రప్పించి.. పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలో పంచాయతీ పెద్దలు.. ఇరు కుటుంబాలతో మాట్లాడి.. రాజీ చేసి.. వారిద్దరికి పెళ్లి చేసేలా ఒప్పించారు. ఈ క్రమంలో స్థానిక ఆలయంలో మున్నా రాజ్, అతడి గర్ల్ ఫ్రెండ్‌కి వివాహం చేశారు. ఏది ఏమైతేనం.. బావిలోకి దూకి మరి తన ప్రేమను గెలిపించుకున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు ఈ విషయం తెలిసిన వారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.