ఈ మద్య ఉన్నత చదువులు చదివిన వారు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధిపై దృష్టి పెడుతున్నారు. బీటెక్ చదివి చిన్న వ్యాపారాలు మొదలు పెట్టి కోట్లు సంపాదించే రేంజ్ కి ఎదుగుతున్నారు. ఆ మద్య ఓ బీటెక్ స్టూడెంట్ ‘బీటెక్ చాయ్ వాలా’ అంటూ టీ స్టాల్ ఏర్పాటు చేసి మంచి బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు. తాజాగా ఓ యువతి అదే బాటలో నడుస్తూ ‘బీటెక్ చాయ్ వాలీ’ తో టీస్టాల్ నడిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.
బీహార్ కి చెందిన వర్తికా సింగ్ అనే యువతి ఇంజనీరింగ్ చదువుతుంది. బీటెక్ చేసే సమయంలో తనకు సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకొని ఎవరిపై ఆధారపడకుండా జీవించాలనే కోరిక కలిగింది. అంతే తన కల సాకారం చేసుకుంటూ ఫరీదాబాద్ వద్ద ‘బీటెక్ చాయ్ వాలీ’ పేరు తో టీస్టాల్ ప్రారంభించింది. తన చదువుకు ఈ వ్యాపారం అడ్డు రాకుండా సమయాన్ని కేటాయిస్తుంది.
వర్తకా సింగ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఉన్నత చదువు చదవి ఉద్యోగాలు వస్తాయని అశతో ఉంటారు.. కొంతమందికి ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. బీటెక్ చేస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగమే చేయాలని రూల్ లేదు కదా? నేను సొంతంగా వ్యాపారం చేయాలని చిన్నప్పటి నుంచి కల కన్నాను.. ఇటా ‘బీటెక్ చాయ్ వాలీ’ని ప్రారంభించాను. నా చదువుకు ఇబ్బంది లేకుండ సాయంత్రం 5.30 నుంచి ప్రారంభించి రాత్రి 9 గంటల వరకు టీ స్టాల్ నడిపిస్తానని తెలిపింది.
ఈ వ్యాపారంలో తాను బాగా సక్సెస్ అయితే పది మందికి ఉపాధి అవకాశం కల్పించాలన్నదే తన కోరిక అని చెబుతుంది వర్తికా సింగ్. వర్తికా సింగ్ ‘బీటెక్ చాయ్ వాలీ’ టీ స్టాల్ వద్దకు చాలా మంది కస్టమర్లు వస్తున్నారు.. ఇక్క టీ చాలా బాగుంటుందని ఆమెకు కితాబు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వర్తికా తన ఇన్ స్ట్రాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.