ఓ చోట ఇద్దరు యువతులు కలిశారు. అలా కొన్ని రోజుల పాటు కలుసుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం కాస్త బలపడింది. దీంతో రోజూ కలవడం, మాట్లాడుకోవడం కూడా చేస్తున్నారు. ఇక మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదని, ప్రేమ అని తెలుసుకుని ప్రేమ విహారంలో తెేలియాడారు. ఇక ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. ఇంతటితో ఆగారా అంటే అదీ లేదు. చివరికి సంసారం చేసేందుకు కూడా రెడీ అయ్యారు. ఇద్దరూ అమ్మాయిలే అయితే అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. త్వరలో వీరిద్దరికిీ ఆ పని కూడా సాధ్యమేనని డాక్టర్లు సైతం బల్లగుద్ది చెబుతున్నారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ అరుదైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు ఈ స్టోరీ ఏంటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయారాజ్ నగరానికి చెందిన ఇద్దరు యువతులు కొంత కాలం ప్రేమించుకున్నారు. ఇంతటితో ఆగకుండా ఇంకాస్త ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. వారిలో ఓ యువతి అందుకు తగినట్లుగా శస్త్రచికిత్స కూడా చేయించుకుంది. ఆమెకు చికిత్స చేసిన వైద్యులు మాట్లాడుతూ.. శస్త్రచికిత్సకు మరో ఏడాదిన్నర సమయం పడుతుందని, ఆ తర్వాత యువతి పురుషుడిగా మారుతుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Coconut: వైరల్ వీడియో.. టెంకాయ ఎంత పని చేసింది.. కొంచెం ఉంటే ఆమె ప్రాణాలు పోయేవి..
చికిత్స చేయించుకున్న యువతికి టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఇస్తామని, దీనివల్ల ఛాతీ భాగంలో వెంట్రుకలు మొలుస్తాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత మహిళ గర్భందాల్చే పరిస్థితి ఉండదన్నారు. ‘‘ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం ఇదే మొదటిసారి. 18 నెలల వ్యవధిలో ఈ చికిత్స పూర్తవుతుంది, ఈ శస్త్రచికిత్స చేయించుకున్న యువతి పూర్తి ఆరోగ్యంగా ఉంది’’ అని డాక్టర్ మోహిత్ తెలిపారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చిన ఈ వచ్చిన ఈ చికిత్స వార్త దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.