ఫిల్మ్ డెస్క్- బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజేత సన్నీ బిజీ బిజీగా గడుపుతున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచినప్పటి నుంచి టీవీ ఛానల్స్ లో ఇంర్వూలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఐతే ఈ క్రమంలో ముందు నుంచి తనకు మద్దతు చెలిపిన వారిని, పలు మాధ్యమాల ద్వార అండగా నిలబడ్డవారిని సన్నీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
సన్నీ బిగ్ బాస్ విన్నర్ కావడానికి కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా ఫ్యాన్ పేజీలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వంక తలెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం టీవీ ఛానళ్లకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తూ, తన గెలుపు కోసం అహర్నిశలు పోరాడిన యూట్యూబ్ రివ్యూయర్లకు, ఓట్ల కోసం కష్టపడ్డ ఫ్యాన్ పేజీలకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదని చాలా మంది ఆరోపిస్తున్నారు. అందుకే బిగ్ బాస్ విజేతగా నిలిచిన సన్నీకి గర్వం తలకెక్కిందన్న వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు
ఇదిగో ఈ క్రమంలో సినీ నటి మాధవీలత సన్నీపై తీవ్ర స్థాయిలో మండిపింది. బిగ్ బాస్ టైటిల్ గెలవడానికి సన్నీని సపోర్ట్ చేసిన ఫ్యాన్ పేజీలను వదిలేసి, రివ్యూయర్లను వదిలేసి, ఓట్లు వేయడానికి వాళ్లు పడ్డ కష్టాన్ని వదిలేసి, ఓట్లు వేయండని మొత్తుకునే వాళ్లను వదిలేసి బడా టీవీ ఛానళ్లకు, ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడని మండిపడుంది. కనీసం తనకు ఓట్లు వేయమని చెప్పనివాళ్లకు ప్రిఫరెన్స్ ఇచ్చి తప్పు చేస్తున్నాడు సన్నీ.. అని కామెంట్ చేసింది.కృతజ్ఞతాభావం లేనివాళ్లంటే నాకు చిరాకు, అతడి కోసం ఎంతమంది పర్సనల్ రిలేషన్‌షిప్ మేనేజర్లలా మారిపోయారు, వాళ్లకు థ్యాంక్స్ అని ఒక మాట చెప్తే సరిపోతుందా, తన గురించి గొప్పగా చెప్పుకొచ్చిన యూట్యూబ్ రివ్యూయర్ల పేర్లయినా మెన్షన్ చేశాడా, కనీసం తనకు తెలీకపోతే అతడి ఫ్రెండ్స్‌కి తెలియదా.. కళ్లు నెత్తికెక్కాయా.. అని మాధవీలత ఫైర్ అయ్యింది.
నీకోసం మామూలు అమ్మాయిలు ఎన్ని మాటలు పడ్డారు, నీ విజయం వాళ్లదని ఫీలయ్యారు, నీ ఫ్యాన్ పేజెస్ మెయింటెన్ చేసిన వాళ్లను కలవాలి, నీ పీఆర్ ఫ్రెండ్ కనిపిస్తే చెంప పగలగొడతాను అని మాధవీలత ఘాటుగా స్పందించింది. వారం రోజులవుతున్నా ఇంకా పెద్ద ఛానల్స్‌తోనే బిజీ ఉండటం తప్పు, నాకు నచ్చడం లేదు, నాకు కోపం వస్తే అదే మీడియాలో నిలబెట్టి కడిగేస్తా, నచ్చితే నెత్తిన పెట్టుకుంటాను, తిక్కలేస్తే తాట తీసి ఆరేస్తా.. అని సన్నీకి మాధవీలత వార్నింగ్ ఇచ్చింది. సాధారణ జనానికి విలువివ్వకపోతే అక్కడే ఆగిపోతావు గుర్తుంచుకో అని హితువు పలికింది.