ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్న సంప్రదాయాలు ఉంటాయి. వీటిని ఆయా ప్రాంతంలోని పూర్వీకులు ప్రారంభిస్తే ఆ తర్వాతి తరం వారు కొనసాగిస్తుంటారు. అయితే కొన్ని సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి విషయాల గురించి విన్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తాజాగా అలాంటి వింత ఆచారం ఒకటి న్యూజిలాండ్ లోని ఓ ప్రాంతంలో ఉంది. ఆ ఆచారం ఏంటంటే.. ఆ ప్రాంతానికి వెళ్లిన ఆడవాళ్లు.. తమ వేసుకున్న ‘బ్రా’ లను అక్కడే ఉన్న 40 మీటర్ల ఫెన్స్ పై వేలాడదీస్తారు. ఆ ఆచారంతో అక్కడ వందల సంఖ్యలో విభిన్నమైన బ్రా లు దర్శనమిస్తుంటాయి. అయితే దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో, ఈ ఆచారానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూజిలాండ్ లోని కార్ డ్రోనా అనే ప్రాంతం ఉంది. ఇక్కడ సుమారు 25 ఏళ్ల క్రితం.. అంటే 1999వ సంవత్సరంలో అందరు క్రిస్మస్ మరియు న్యూయర్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ ఫెన్స్ కు నాలుగు బ్రాలు వేలాడదీసి కనిపించాయి. అవి ఎవరు, ఎందుకు పెట్టారు అనే కారణం తెలియదు. అయితే ఈ బ్రా వార్త.. ఆ నోటా, ఈ నోటా స్థానికంగా వ్యాప్తించింది. దీనిపై అనేక వార్తలు కూడా షికారు చేశాయి. దీంతో అక్కడి మహిళలు ఒక్కొక్కరిగా ఆ ఫెన్స్ వద్దకు రావడం, తాము ధరించిన బ్రాను తొలగించి ఇక్కడ వేలాదీసి వెల్లిపోయేవారు. అలా క్రమ క్రమంగా అక్కడ బ్రా ల సంఖ్య పెరుగుతూ వచ్చాయి. కొన్ని రోజులకు వాటి సంఖ్య వందల్లో చేరింది. కొన్ని సార్లు బ్రా లను దొంగలు దొంగిలించే వారట. అయినా వాటి సంఖ్య పెరిగేదే కానీ తగ్గేది కాదట.
ఆ దొంగతనం జరిగిన తరువాత ఆ ప్రాంతం మరింత ఫేమస్ అయిందని స్థానికులు తెలిపారు. ఆ బ్రాల ప్రాంతం గురించి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. దీంతో అక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఆ ప్రదేశాన్నికి వెళ్లి అమ్మాయిలు కచ్చితంగా తాము ధరించిన బ్రాను విప్పి.. అక్కడే ఫెన్స్ కి వేలాడదీసి వెళ్లే వారంట. అలా చేస్తే తమకు ఆరోగ్య పరంగా మంచి జరుగుతుందని వారి నమ్మకమంట. ఇలా ఆ ప్రాంతానికి వచ్చిన పాపులారిటీతో కార్ డ్రోనాగా ఉన్న ఆ ప్రాంతం పేరు కాస్తా ‘బ్రాడ్రోనా’ గా మారిపోయింది. అయితే ఈ ఫెన్స్ రోడ్డు పక్కనే ఉండటం, వేలాది సంఖ్యలో రకరకాల బ్రాలు వేలాడుతుండటంతో .. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. దీంతో అక్కడి నుంచి పక్క వీధికిలో ఆ ఫెన్స్ ని మార్చారు. ప్లేస్ మార్చిన కూడా దాని పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు.
కాలక్రమేణా ఆ పర్యాటక ప్రాంతాన్ని గుర్తించిన ‘న్యూజిలాండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఇదే వేదికగా రొమ్ము క్యాన్సర్ బాధితుల కోసం నిధుల సేకరణ చేపట్టింది. ఇందుకోసం ఈ ఫెన్స్ కి ముందు బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ఫ్లెక్సీతో పాటు డోనేషన్ బాక్స్ ను ఏర్పాటు చేశారు. అక్కడి వెళ్లి అమ్మాయిలు.. తమ ‘బ్రా’ లను వేలాడదీయడంతో పాటు తమకు తోచినంత డబ్బును ఈ బాక్స్ లో వేస్తుంటారు. ఇలా పోగైన డబ్బును అక్కడి రోమ్ము క్యాన్సర్ బాధితుల చికిత్స కోసం వినియోగిస్తున్నారు. ఇలా బ్రాల ఫెన్స్.. ఆచారంతో మొదలై.. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న ఎందరో మహిళలను కాపాడుతుంది. మరి.. ఈ వేరైటి ప్రాంతంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.