రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు, పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయిన కొందరు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరొకవైపు హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనం నడుపుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కొందరు పోలీసులకు భయపడి, జరిమానల నుంచి తప్పించుకునేందుకు నామమాత్రంగా హెల్మెట్ ధరిస్తున్నారు. అయితే కొన్ని హెల్మెట్లు తల మొత్తాన్ని కవర్ చేయవు. అలాంటి హెల్మెంట్ ధరించి.. వాహనం నడిపే వ్యక్తులు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ(WHO) ప్రపంచ దేశాలకు రెండు మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ఆధారంగా దేశాలు చట్టాలు చేయాలని సూచించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం… రోడ్డు ప్రమాదాలు ప్రతి నిమిషానికి రెండు కంటే ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 13 లక్షల మంది మరణిస్తున్నారు. మధ్య, తక్కువ ఆదాయాలు గల దేశాల్లో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 5 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల వాళ్ల మరణాలకు రోడ్డు ప్రమాదాలే ప్రధాన కారణమని డబ్ల్యూహెచ్ వో అధికారులు తెలిపారు. దీంతో తాజాగా కొత్త నిబంధనలు ప్రపంచ దేశాలకు జారీ చేసింది. తలతో సహా ముఖాన్ని పూర్తిగా కప్పేసే హెల్మెట్ లను ధరించాలని తెలిపింది. దీని వలన తీవ్రగాయాలను, తలకి తగిలే గాయాలను చాలా వరకు నిరోధించవచ్చని తెలిపింది.
ఈ ద్విచక్ర, త్రి చక్రవాహనదారులు హెల్మెట్ వాడకంపై, పాదచారుల భద్రతపై అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ రూపొందించిన గైడ్ లైన్స్ లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టైక్నాలజీ నిపుణులు కూడా పాల్గొన్నారు. పాదచారుల, ద్విచక్రవాహనదారుల మరణాలను తగ్గించడంలో , రోడ్ల పరిస్థితులు మెరుగుపరచడం, చట్టాలను బలోపేతం చేయడం వంటి వాటికి సంబంధించిన కొన్ని అంశాలను ఐఐటీ నిపుణలు సిఫార్సు చేశారు. మరి..డబ్ల్యూహెచ్ వో విడుదల చేసిన తాజాగా గైడ్ లైన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.