Ulas Family: ఈ ప్రపంచంలో మనకు తెలియని చాలా విషయాలు దాగున్నాయి. కొన్ని పకృతికి సంబంధించినవి అయితే.. మరికొన్ని మనలాంటి మనషులకు సంబంధించినవి. ఆయా ప్రాంతాలను బట్టి మనుషులు ఒక్కో తీరులో ప్రవర్తిస్తుంటారు. వారిని చూస్తే వీళ్లకేమైనా పిచ్చా అనిపిస్తుంది. ఇక, టర్కీకి చెందిన ఓ కుటుంబాన్ని చూస్తే ఇదేం వింత ఫ్యామిలీరా బాబు అని అనక మానరు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ చాలా డిఫరెంట్. సాధారణ మనుషుల్లాగా కాకుండా వింతగా ప్రవరిస్తుంటుంది. ఎల్లప్పుడూ నాలుగు కాళ్లపై నడుస్తుంటుంది. మరి, వాళ్లు ఎందుకలా కాళ్లు, చేతులపై నడుస్తారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదివేయాల్సిందే.. టర్కీలోని ఉలాస్ కుటుంబం చాలా ఏళ్ల నుంచి కాళ్లు, చేతులపై గోరిల్లాలాగా నడుస్తోంది. అలా కొద్దిసేపు కాదు.. ప్రతి క్షణం ప్రతీరోజూ అలానే నడుస్తుంది. 2006లోనే ఈ కుటుంబం అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ‘బీబీసీ’ దీనిపై ఓ కథనం కూడా ప్రచురించటంతో ఆ గుర్తింపు వచ్చింది. అంతకంటే ముందు ఓ టర్కీష్ సైంటిస్ట్ రాసిన ఓ ఆర్టికల్ ద్వారా ఈ కుటుంబం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నికోలస్ హంప్‌రే అనే సైకాలజిస్టు.. ఉలాస్ కుటుంబం అలా నడవటానికి గల కారణాలను అన్వేషించాడు. ఉలాస్ కుటుంబంలో జన్మించిన 19 మంది పిల్లల్లో 12 మంది చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించాడు. ఆ 19 మందిలో ఓ ఐదుగురు తమ కాళ్లు, చేతుల సహాయంతో గోరిల్లాలా నడుస్తున్నారని, ఆ ఐదుగురికి ‘నాన్ ప్రోగ్రెసివ్ కాన్నిషియల్ సెరెబ్రల్ అలాక్సియా’ వ్యాధి ఉన్నట్లు కనుగొన్నాడు. ఆ వ్యాధి కారణంగా వాళ్లు రెండు కాళ్లపై నిలబడ్డం కష్టంగా మారిందని, అందుకే చేతుల సహాయంతో నడుస్తున్నారని తేల్చాడు. దీంతో వారి నడక వెనుక ఉన్న మిస్టరీ వీడింది. మరి, కాళ్లు, చేతులపై గోరిల్లాలా నడుస్తున్న ఈ కుటుంబంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : వ్యక్తి అకౌంట్‌లో ఏకంగా రూ. 4 లక్షల కోట్లు జమ.. భయంతో ఏం చేశాడంటే!