ఆటలు అన్నాక గాయాలు కావడం సహజం. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ గాయాల కారణంగా తమ కెరీర్ నే వదులుకోవాల్సిన పరిస్థితులూ వస్తాయి. ఇక మరి కొన్ని సందర్భాల్లో అయితే ప్రాణాలే పోతాయి. అయినప్పటికీ క్రీడాకారులు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఒక గౌరవంగా భావిస్తారు. దానికోసం.. దేనికైనా.. సిద్ధపడతారు. ఈక్రమంలోనే ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రమాదానికి గురైన సంఘటన సంచలనం రేపింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అనెమిక్ వాన్ లూటెన్.. నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ సైక్లిస్ట్. 2020 టోక్యో ఒలింపిక్స్ లో టైమ్ ట్రయల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అదీ కాక రోడ్ రేస్ లో రజత పతకం గెలిచి రికార్డు నెలకొల్పింది. ఇక లూటెన్ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న రోడ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగింది. మిక్స్ డ్ ట్రాయల్ రన్ లో భాగంగా బుధవారం తాజాగా రెండో రౌండ్ పోటీలు జరిగాయి. గేమ్ ప్రారంభం కాగానే స్పీడ్ గా వెళ్తున్న లూటెన్ సైకిల్ ప్రమాదానికి గురైంది. దాంతో ఆమె ఒక్కసారిగా పక్కనే ఉన్న బారికేడ్ కు తాకి రోడ్డుపైనే కిందపడింది. వెనకాలే వస్తున్న మరో సైక్లిస్ట్ ఆమెను తప్పించుకుని ముందుకు సాగింది.
ఈ ప్రమాదంలో లూటెన్ మో చేయికి తీవ్రగాయం అయినట్లు అక్కడి మీడియా తెలిపింది. ప్రస్తుతం ప్రమాదానికి గురైన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని యూసీఐ వరల్డ్ టూర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.”మెకానికల్ ప్రాబ్లం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇది నిజంగా నెదర్లాండ్ అభిమానులకు నిరాశే” అంటూ అందులో రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తనకు జరిగిన ప్రమాదంపై లూటెన్ స్పందించింది. ప్రమాదంపై మాట్లాడుతూ.. “సైకిల్ టైర్ పగలడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ క్షణం నాకు ఏజరిగిందో అర్ధం కాలేదు. నేను సైకిల్ ను సరిగా బ్యాలెన్స్ చేయలేదు అనుకుంటున్నా.. ప్రస్తుతానికి నేను ఆసుపత్రిలో బాగానే ఉన్నా” అంటూ పేర్కొంది. మరి ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
⚠️ CRASH for @AvVleuten!! ⚠️
Mechanical issue causes horrible crash for the Dutch superstar.
Really disappointing day for the Dutch. #Wollongong2022 pic.twitter.com/rU5LYNnlcu— UCI (@UCI_cycling) September 21, 2022