టీమిండియా స్టార్ ఆటగాడు హార్ధిక్ పాండ్యాతో పాటు మాజీ ప్లేయర్ మున్నాఫ్ పటేల్, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తనపై అత్యాచారం చేశారని రెహ్నుమా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి ఈ ఆరోపణ చేస్తూ కేసుపెట్టారు. సదరు వ్యక్తులంతా తనను లైంగిక వేధింపులకు గురి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబైలోని సాంతా క్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన భర్త రియాజ్ భాటి స్వప్రయోజనాల కోసం అతని వ్యాపార భాగస్వామ్యులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడని, అలా కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీల వద్దకు తనను పంపేవాడని రెహ్నుమా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, రెహ్నుమా ఇచ్చిన ఫిర్యాదులో సరైన అడ్రస్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ ఫిర్యాదుకు సంబంధించిన పేపర్లు నెట్టింట వైరల్‌గా మారాయి. సెప్టెంబర్‌లో కేసు పెట్టినా పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, తనకు జరిగిన అన్యాయంపై పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని రెహ్నామా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు వివరాలను వెల్లడించడానికి ముంబై పోలీస్ అధికారులు నిరాకరించారు. విచారణ జరుగుతుందని, ఇప్పుడేం చెప్పలేమన్నారు.
COMPLAINT COPY EXCLUSIVE‼️ https://t.co/Nj2U9UoA8P pic.twitter.com/o5uWCoDfLx
— Sameet Thakkar (@thakkar_sameet) November 10, 2021