Bulli Bai Sulli Deals Case Mumbai Court Grants Bail: దేశవ్యాప్తంగా జనాలు సంతోష, సంబరాల మధ్య 2022 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికితే.. మరోవైపు మన దేశంలోని ముస్లిం మహిళలు, యువతులు మాత్రం.. ఇంటి లోపలే ఉంటూ.. బిక్కు బిక్కు మంటూ.. ఫోన్లు చూస్తూ గడిపారు. అవును మరి సరిగా ఆరు నెలల క్రితం ముస్లిం మహిళలను టార్గెట్ చేసుకుని కొందరు రాక్షసులు ఎంతటి దారుణానికి తెగ బడ్డారో.. వారిని ఎంత మానసిక క్షోభకు గురి చేశారో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ చూశారు. బుల్లి బాయ్ పేరిట కొందరు నరరూప రాక్షసులు.. వందలాది మంది ముస్లిం మహిళల ఫోటోలను సేకరించి.. వాటిని ఆన్ లైన్ లో వేలానికి పెట్టి.. దారుణమైన వికృత చేష్టలకు పాల్పడిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి.. అప్పట్లో కొందరిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ముంబై కోర్టు ఈ నేరస్తులకు బెయిల్ మంజూరు చేసింది.
బుల్లి బాయ్స్ పేరిట ముస్లిం మహిళల ఫోటోలను ఆన్లైన్లో వేలానికి పెట్టిన ఈ కేసులో గతంలో పోలీసులు ఈ యాప్‌లను రూపొందించినందుకు గాను ఔమ్కారేశ్వర్ ఠాకూర్(25), నీరజ్ బిష్ణోయ్(20)లతో పాటు మరో నలుగురుని జనవరిలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఆరుగురుకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆన్లైన్లో యాక్టీవ్‌గా ఉండే ముస్లిం మహిళలు, యువతుల సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వారికి తెలియకుండా ఫోటోలు సేకరించి.. వాటిని గిట్ హాబ్ అనే ఒపెన్ సోర్స్ ప్లాట్ ఫాంలో సల్లీ డీల్స్, బుల్లి బాయ్ పేరిట యాప్‌లు తయారు చేసి.. ముస్లిం మహిళల ఫోటోలను వేలానికి ఉంచారు. దారుణం ఏంటంటే ఈ యాప్ లో అప్ లోడ్ చేసిన ఫోటోల్లో సామాన్య ముస్లిం యువతుల నుంచి.. ప్రముఖ డాక్టర్లు, జర్నలిస్ట్ లు, వివిధ రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న వారి ఫోటోలు కూడా ఉండటం గమనార్హం.
ఇది కూడా చదవండి: బుల్లీ బాయి-సుల్లీ డీల్స్ అంటే ఏమిటి? వీళ్ళు అసలు మనుషులేనా?
తొలుత సల్లీ డీల్స్ పేరిట..
బుల్లి బాయ్ వివాదం తెర మీదకు రావడానికి సరిగా ఆరు నెలల క్రితం అనగా.. జూలై 4, 2021న గిట్ హాబ్ యాప్‌కు చెందిన ఓ గుర్తు తెలియని గ్రూప్ సల్లీ డీల్స్ పేరిట వందలాది ముస్లిం మహిళల ఫోటోలను వేలానికి పెట్టింది. ఈ యాప్ క్రియేటర్స్ దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మహిళల సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వారి ఫోటోలను వారి అనుమతి లేకుండా సేకరించి.. తప్పుడు పనులకు వాడారు. ఈ ఫోటోలను మార్ఫ్ చేసి ట్రోల్ చేయడమే కాక.. వేలానికి పెట్టి.. రాక్షసానందం పొందారు. మరో సారి ఇదే రకమైన వికృత క్రీడకు తెరతీసింది. ఈ సారి బుల్లి బాయ్ పేరిట ముస్లిం మహిళల ఫోటోలను వేలానికి పెట్టింది.
‘బుల్లి బాయ్’ యాప్‌లో అప్లోడ్..
మళ్లీ ఆరు నెలల తర్వాత ఇద గిట్ హబ్ ప్లాట్ ఫాంలో ఈ బుల్లి బాయ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. సోషల్ మీడియా యూజర్లు తెలిపిన వివరాల ప్రకారం.. యూజర్లు ఈ యాప్ ని ఒపెన్ చేయగానే.. ముస్లిం మహిళల ఫోటోలను బుల్లి బాయ్ పేరుతో చూపిస్తోంది. ట్విటర్లో చురుగ్గా ఉండే మహిళల ఫొటోలు, పేర్లను ఇందులో ఉపయోగిస్తున్నారు. ఆ మహిళల ఫొటో కింద బుల్లీ బాయ్ అని రాస్తారు. ఈ యాప్ ద్వారా సదరు మహిళలతో డీల్ చేసుకోవచ్చని ఇందులో పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో.. పోలీసులు నిందితులందరిని అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Upasana Konidela: మంచి మనసు చాటుకున్న మెగా కోడలు ఉపాసన.. ఇక వారికి అపోలో ఆస్పత్రిలో ఉచిత వైద్యం!