Upasana Konidela: మెగా కోడలు ఉపాసన ఎంత అందంగా ఉంటారో.. అంతకన్నా మంచి మనసు కల వ్యక్తి. మొదటి నుంచి జంతు ప్రేమికురాలు కూడా. ఇక ఆమె చేసే మంచి పనులతో ఇటు పుట్టింటికి, అటు మెట్టినింటికి మంచి పేరు తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు మెగా కోడలు ఉపాసన. జంతుప్రేమికురాలైన ఉపాసన.. వాటి సంరక్షణ కోసం పని చేసే వారికి శుభవార్త చెప్పారు. వన్యప్రాణి సంరక్షణ కోసం, జంతు, జీవ రాశుల పోషణ కోసం డబ్బుతో పాటు తన అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తున్న ఉపాసన మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఫారెస్ట్ గార్డులతో పాటు వన్యప్రాణి సంరక్షణ కోసం పని చేసే వాళ్లకు తమ అపోలో హాస్పిటల్స్ నెట్వర్క్లో ఉచితంగా వైద్యసంరక్షణతో పాటు చికిత్స అందించడానితి తమ వంతు సహాయం అందిస్తామని వాగ్ధానం చేశారు ఉపాసన. ఈకార్యక్రమాన్ని చేపడుతున్న డబ్లూడబ్లూఎఫ్ (wwf)తో కలిసి ఆ సేవలను అందించడానికి అంగీకరిస్తున్నట్లుగా తెలిపారు. ఉపాసన తాతయ్య అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి, రెడ్డి కూడా పాల్గొన్నారు. భారతదేశంలోని అడవులతో పాటు వన్యప్రాణులను రక్షించే రేంజర్లకు ఉత్తమమైన చికిత్స అందిస్తామని ఉపాసన ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చూస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని వేర్వేరు శాఖల ఉద్యోగుల వైద్యసేవలను తాము చూసుకుంటామని తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రభాస్ అడిగితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను: గోపిచంద్ అటవీ ప్రాంతాలు, అభయారణ్యాల్లో విధులు నిర్వహించే ఫారెస్ట్ రేంజర్లు మనుషుల వల్ల లేదంటే వన్యప్రాణుల, సంఘర్షణలో ఏమైనా గాయాలైనా వారికి అవసరమైన వైద్య సేవలందిస్తామని ఎంవోయూలో పేర్కొన్నారు. ఫారెస్ట్ సిబ్బంది ఎక్కడైనా పడిపోవడం లేదా ఏదైనా ఇతర అటవీ సంబంధిత రుగ్మతల వల్లనైనా గాయపడిన వారికి అపోలో హాస్పిటల్స్ తరపున ఉచిత వైద్యసేవలు అందిస్తామని ఎంవోయూలో పేర్కొన్నారు ఉపాసన. ఈ ఒప్పందానికి అపోలో హాస్పిటల్స్ కట్టుబడి ఉందని అపోలో ఫౌండేషన్ తరపున ఒప్పంద పత్రంపై సంతకం చేశారామె. ఆ ఎంవోయూ ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు. ఇప్పటికే డబ్లూడబ్లూఎఫ్తో ఉపాసన కలిసి పని చేస్తున్నారు. ఫారెస్ట్ ఫ్రంట్లైన్ హీరోస్ డబ్లూడబ్లూఎఫ్ ఇండియాకు ఉపాసన కూడా అంబాసిడర్గా ఉన్న సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: Rolex: ‘విక్రమ్ 2’లో విలన్ సూర్య కాదా..? మరో స్టార్ ఎంటర్ అవ్వబోతున్నాడా? We at @ApolloFND pledge to bear the medical expenses & provide the best treatment to rangers who protect India's forests & wildlife. We will also try to take care of as many forest communities who play an integral role in wildlife conservation. @HospitalsApollo @WWFINDIA pic.twitter.com/h3gR29FIZz — Upasana Konidela (@upasanakonidela) June 24, 2022 ఉపాసన కొణిదెలకు వన్యప్రాణులన్న, మూగజీవాలన్న ఎంతో ఇష్టమని..వాటిని సంరక్షించడం, వాటి బాగోగులు చూసుకోవడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని గతంలో ఉపాసన మామ చిరంజీవే స్వయంగా చెప్పారు. శరీర అవయవాలు సరిగా లేని మూగజీవులు, జంతువుల కోసం ఉపాసన కొంత స్థలాన్ని కేటాయించి అక్కడ వాటికిఆహారం, నివాసం, ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఓ ఇంటర్వూలో మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఉపాసన తీసుకున్న నిర్ణయం చూస్తే.. చిరంజీవి ఆమె గురించి చెప్పింది నిజమని అర్థం అవుతోంది. మరి ఉపాసన తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Chinmayi: సింగర్ చిన్మయి అకౌంట్ డిలీట్ చేసిన ఇన్స్టాగ్రామ్..!