Chinmayi: ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయ్యింది. అదికూడా ఇన్ స్టాగ్రామ్ స్వయంగా చిన్మయి అకౌంట్ ను డిలీట్ చేయడం గమనార్హం. అందుకు కారణం ఆమె అకౌంట్ ని రిపోర్ట్ చేయడమే. ఆ రిపోర్ట్ చేసింది కూడా ఎవరో కాదు నెటిజన్స్. ప్రస్తుతం.. చిన్మయి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి చిన్మయి అకౌంట్ డిలీట్ అవ్వడం వెనుక అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. సింగర్ అయినటువంటి చిన్మయి.. సోషల్ మీడియా వేదికగా అమ్మాయిల(మహిళల)పై జరుగుతున్న అన్యాయాలు, సమస్యలపై పోరాడుతుంటుంది. వరకట్న వేధింపులు మొదలుకొని మానసిక, శారీరక వేధింపులకు గురైన మహిళలకు సపోర్ట్ గా ఉంటోంది. ఈ క్రమంలో చిన్మయిని ఎంతోమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. ఇక తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి కొందరు నెటిజన్లు(అబ్బాయిలు) అభ్యంతరకరమైన ఫోటోలు పంపుతున్నారని.. దీనిపై ఇన్ స్టాగ్రామ్ కిఫిర్యాదు కూడా చేశానని ఇదివరకే తెలిపింది. అదీగాక తన అకౌంట్ ను చాలామంది రిపోర్ట్ చేయడం వలన ఇన్ స్టాగ్రామ్ డిలీట్ చేసినట్లు సమాచారం. ''నాకు అభ్యంతరకరమైన ఫోటోలు పంపిన వారే నా అకౌంట్ పై రిపోర్ట్ చేయడంతో ఇన్ స్టాగ్రామ్ నా అకౌంట్ డిలీట్ చేసింది'' అని తాజాగా ట్విట్టర్ తెలిపింది చిన్మయి. అలాగే తన బ్యాకప్ అకౌంట్ వివరాలు కూడా ట్వీట్ లో పేర్కొంది. మరి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన చిన్మయి అకౌంట్ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. Instagram has basically removed MY account for reporting men who send ME their penises on DMs. Its been going on for a while where I report but MY access was barred. Anyway that’s that. My backup account is chinmayi.sripada ♀️ — Chinmayi Sripaada (@Chinmayi) June 23, 2022 View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayi.sripada) ఇదీ చదవండి: సరోగసి వార్తలపై స్పందించిన సింగర్ చిన్మయి!